Telugu Global
Cinema & Entertainment

"నవాబ్" తో డయానా క్వీన్ అయ్యేనా..!!

సెన్సేషనల్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో అరవింద్ స్వామి, శింబు, విజయ్ సేతుపతి, అరుణ్ విజయ్ లు కలిసి నటిస్తున్న చిత్రం ‘నవాబ్’. ఏ ఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ లుగా  అదితి రావు హైదరి, ఐశ్వర్య రాజేష్, డయానా లు హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఇటీవలే రిలీజ్ అయిన చిత్ర ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ ట్రైలర్ సినిమాపై మంచి అంచనాలను పెంచింది. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్న […]

నవాబ్ తో డయానా క్వీన్ అయ్యేనా..!!
X

సెన్సేషనల్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో అరవింద్ స్వామి, శింబు, విజయ్ సేతుపతి, అరుణ్ విజయ్ లు కలిసి నటిస్తున్న చిత్రం ‘నవాబ్’. ఏ ఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ లుగా అదితి రావు హైదరి, ఐశ్వర్య రాజేష్, డయానా లు హీరోయిన్ లుగా నటిస్తున్నారు.

ఇటీవలే రిలీజ్ అయిన చిత్ర ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ ట్రైలర్ సినిమాపై మంచి అంచనాలను పెంచింది. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 27 న రిలీజ్ అవుతుంది.

కాగా ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయమవుతున్న డయానా సినిమా పై మంచి హోప్స్ పెట్టుకుంది. సాధారణంగా మణిరత్నం హీరోయిన్స్ కి మంచి గుర్తింపు లభిస్తుంది. కానీ మణిరత్నం దర్శకత్వంలో నటించిన కొంత మంది హీరోయిన్స్ మాత్రం కనుమరుగై పోయారు. మరి డయానా స్టార్ అవుతుందా? లేదో? చూడాలి. ఇప్పటికే ఫస్ట్ లుక్ ఫోస్టర్స్ తో సూపర్ అనిపించుకున్న ఈ ముద్దుగుమ్మ…. నటనలోనూ పర్వాలేదు అనిపించుకుంటే…. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోనూ వరుస ఆఫర్స్ తో దూసుకెళ్లే అవకాశం ఉంది.

First Published:  17 Sep 2018 7:02 PM GMT
Next Story