Telugu Global
Cinema & Entertainment

నా దారి రహదారి " సమంత

యూటర్న్ సినిమా తనకు కొండంత ఉత్సాహాన్ని, బలాన్ని ఇచ్చిందని అంటోంది సమంత. ఇకపై కూడా తన కెరీర్ ను ఇలానే కొనసాగిస్తానని, సామాజిక సందేశంతోనే సినిమాలు చేస్తానని తెలిపింది. తన కెరీర్ లో ఇక రాంగ్ టర్న్ లు ఉండవని స్పష్టంచేసింది. యూటర్న్ సక్సెస్ మీట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ సక్సెస్ మీట్ కు టీఆర్ఎస్ నేత, కేసీఆర్ తనయ కవిత ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తన భవిష్యత్ ప్రణాళికపై […]

నా దారి రహదారి  సమంత
X

యూటర్న్ సినిమా తనకు కొండంత ఉత్సాహాన్ని, బలాన్ని ఇచ్చిందని అంటోంది సమంత. ఇకపై కూడా తన కెరీర్ ను ఇలానే కొనసాగిస్తానని, సామాజిక సందేశంతోనే సినిమాలు చేస్తానని తెలిపింది. తన కెరీర్ లో ఇక రాంగ్ టర్న్ లు ఉండవని స్పష్టంచేసింది.

యూటర్న్ సక్సెస్ మీట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ సక్సెస్ మీట్ కు టీఆర్ఎస్ నేత, కేసీఆర్ తనయ కవిత ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తన భవిష్యత్ ప్రణాళికపై స్పష్టత ఇచ్చింది సమంత. ఇకపై స్టార్ హీరోల సరసన ఆడిపాడే కమర్షియల్ హీరోయిన్ పాత్రలు చేయనని పరోక్షంగా చెప్పేసింది.

గతవారం విడుదలైన యూటర్న్ సినిమా ఓ వర్గాన్ని ఆకర్షిస్తోంది. థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వాళ్లు యూటర్న్ ను మెచ్చుకుంటున్నారు. క్రిటిక్స్ మాత్రం మూకుమ్మడిగా ఈ సినిమాను ప్రశంసించారు. అలా తన సినిమాను మెచ్చుకున్న విశ్లేషకులు అందరికీ కృతజ్ఞతలు తెలిపింది సమంత.

భర్త నాగచైతన్య నటించిన శైలజారెడ్డి అల్లుడు సినిమాతో పాటు తన యూటర్న్ మూవీని రిలీజ్ చేసింది సమంత. ఆ సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చింది. యూటర్న్ కు పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ శైలజారెడ్డి అల్లుడుకు కలెక్షన్లు బాగున్నాయి. యూటర్న్ కు ఆశించిన స్థాయిలో వసూళ్లు లేవు.

First Published:  18 Sep 2018 7:13 AM GMT
Next Story