Telugu Global
NEWS

అసెంబ్లీలో జేసీ హల్‌చల్‌

తాడిపత్రి డేరా బాబా ప్రబోధానంద ఆశ్రమం నుంచి గుండాలను బయటకు పంపాల్సిందేనని స్థానికులుతో కలిసి రెండురోజుల పాటు ఆందోళన చేసిన జేసీ దివాకర్ రెడ్డి ఏపీ అసెంబ్లీ వద్ద ప్రత్యక్షమయ్యారు. ఆశ్రమం నుంచి స్థానికేతరులను ఖాళీ చేయించగలిగిన జేసీ…. చంద్రబాబు చాంబర్‌కు వెళ్లి అరగంట పాటు ఆయనతో సమావేశం అయ్యారు. అనంతరం అసెంబ్లీ లాబీలో చిట్‌చాట్ చేసిన దివాకర్ రెడ్డి…. త్వరలోనే తాడిపత్రి డేరా బాబాకు సంబంధించిన వీడియోలను విడుదల చేస్తానని చెప్పారు. ప్రబోధానందపై పోరాటంలో తాను […]

అసెంబ్లీలో జేసీ హల్‌చల్‌
X

తాడిపత్రి డేరా బాబా ప్రబోధానంద ఆశ్రమం నుంచి గుండాలను బయటకు పంపాల్సిందేనని స్థానికులుతో కలిసి రెండురోజుల పాటు ఆందోళన చేసిన జేసీ దివాకర్ రెడ్డి ఏపీ అసెంబ్లీ వద్ద ప్రత్యక్షమయ్యారు.

ఆశ్రమం నుంచి స్థానికేతరులను ఖాళీ చేయించగలిగిన జేసీ…. చంద్రబాబు చాంబర్‌కు వెళ్లి అరగంట పాటు ఆయనతో సమావేశం అయ్యారు. అనంతరం అసెంబ్లీ లాబీలో చిట్‌చాట్ చేసిన దివాకర్ రెడ్డి…. త్వరలోనే తాడిపత్రి డేరా బాబాకు సంబంధించిన వీడియోలను విడుదల చేస్తానని చెప్పారు.

ప్రబోధానందపై పోరాటంలో తాను నెగ్గానో…. ఓడానో మీడియానే చెప్పాలన్నారు. ప్రబోధానంద బాధితుల్లో అన్ని పార్టీల వారు, అన్ని కులాలు, మతాల వారు ఉన్నారని జేసీ చెప్పారు. ఇలాంటి బాబాకు భయపడే ప్రసక్తే లేదన్నారు. ఏసును, రాముడిని సీతను కూడా ప్రబోధానంద…. లం…, లం… కొడుకులు అంటూ ధూషించిన వీడియోను జేసీ చూపించారు.

First Published:  18 Sep 2018 10:50 AM GMT
Next Story