Telugu Global
Cinema & Entertainment

సెప్టెంబర్ 20 న "దేవదాస్" ప్రీ రిలీజ్ ఈవెంట్

అక్కినేని నాగార్జున, న్యాచురల్ స్టార్ నాని హీరోలు నటించిన సినిమా “దేవదాస్”. “భలే మంచి రోజు” ఫేం శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు అన్ని పూర్తీ చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 27 న రిలీజ్ కి రెడీ అవుతుంది. ఈ నేపధ్యంలో ఈనెల 20 న “దేవదాస్” ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు నిర్మాతలు వెల్లడించారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమాలో లక లక పాటకు శ్రోతల […]

సెప్టెంబర్ 20 న దేవదాస్ ప్రీ రిలీజ్ ఈవెంట్
X

అక్కినేని నాగార్జున, న్యాచురల్ స్టార్ నాని హీరోలు నటించిన సినిమా “దేవదాస్”. “భలే మంచి రోజు” ఫేం శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు అన్ని పూర్తీ చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 27 న రిలీజ్ కి రెడీ అవుతుంది. ఈ నేపధ్యంలో ఈనెల 20 న “దేవదాస్” ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు నిర్మాతలు వెల్లడించారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమాలో లక లక పాటకు శ్రోతల నుంచి విశేష స్పందన వస్తుంది.

ఈ నేపధ్యంలో సోమవారం మరో పాటని చిత్ర యూనిట్ విడుదల చేసింది. “హే బాబు” అంటూ సాగే పాటకి రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా, కార్తి, రమ్య బెహార ఆలపించారు. నాగార్జున డాన్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో నాని డాక్టర్ పాత్రలో నటిస్తున్నాడు. నాగార్జున సరసన ఆకాంక్ష సింగ్ హీరోయిన్ గా నటిస్తుండగా నాని పక్కన రష్మిక నటిస్తుంది. నరేష్, రావు రమేష్, వెన్నెల కిశోర్, అవసరాల శ్రీనివాస్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ అశ్వనిదత్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

First Published:  17 Sep 2018 11:19 PM GMT
Next Story