Telugu Global
NEWS

డిప్యూటీ సీఎంలిద్దరికీ చంద్రబాబు ఝలక్?

గత ఎన్నికల పోలింగ్ కు రెండు రోజుల ముందు డిప్యూటీ సీఎంల అంశాన్ని ప్రకటించాడు చంద్రబాబు నాయుడు. ఒక డిప్యూటీ సీఎం పదవిని బీసీలకు ఇస్తానని, మరోటి కాపులకు అని అప్పట్లో చంద్రబాబు నాయుడు ప్రకటించాడు. ప్రతి కులం మీదా ఇలా ఓట్ల వలను విసిరాడు చంద్రబాబు. అందులో భాగంగా డిప్యూటీ సీఎంల పదవులను కూడా కులాల వారీగా హామీలుగా ఇచ్చాడు. అయితే తీరా అధికారం దక్కాక…. రెండు డిప్యూటీ సీఎం పదవులు అయితే కేటాయించాడు కానీ…. […]

డిప్యూటీ సీఎంలిద్దరికీ చంద్రబాబు ఝలక్?
X

గత ఎన్నికల పోలింగ్ కు రెండు రోజుల ముందు డిప్యూటీ సీఎంల అంశాన్ని ప్రకటించాడు చంద్రబాబు నాయుడు. ఒక డిప్యూటీ సీఎం పదవిని బీసీలకు ఇస్తానని, మరోటి కాపులకు అని అప్పట్లో చంద్రబాబు నాయుడు ప్రకటించాడు. ప్రతి కులం మీదా ఇలా ఓట్ల వలను విసిరాడు చంద్రబాబు. అందులో భాగంగా డిప్యూటీ సీఎంల పదవులను కూడా కులాల వారీగా హామీలుగా ఇచ్చాడు.

అయితే తీరా అధికారం దక్కాక…. రెండు డిప్యూటీ సీఎం పదవులు అయితే కేటాయించాడు కానీ…. వారికి ఉన్న పవర్స్ మాత్రం అంతంత మాత్రమే. పేరుకు డిప్యూటీ సీఎంలు అయినా తమ శాఖల్లో కూడా పనులను చేయించుకునే పరిస్థితుల్లో లేరు ఈ ఇద్దరూ. వీరిద్దరి శాఖల విషయంలోనూ చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ బాబు పెత్తనం కొనసాగుతున్న మాట మొదటి నుంచీ వినిపిస్తోంది.

రెవెన్యూ శాఖలో బదిలీలు చేయించుకోలేని స్థితిలో ఉన్నాడట కేఈ. ఇక హోం శాఖపై చిన్నరాజప్పకు ఉన్న పట్టూ ఏమీ లేదు. ఆయన నియోజకవర్గానికి వెళితే రిసీవ్‌ చేసుకోవడానికి డివైఎస్పీ స్థాయి అధికారి కూడా రాడని అంటారు. ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు డిప్యూటీ సీఎంలిద్దరూ డమ్మీలయ్యారు. అంతే కాదట.. వచ్చే ఎన్నికల్లో వీళ్లకు టికెట్లు కూడా డౌటే అని టాక్.

తను పోటీ చేయనని ఇప్పటికే కేఈ చంద్రబాబుకు చెప్పాడట. తన టికెట్ ను తన తనయుడికి ఇవ్వాలనేది ఆయన కోరిక. అయితే.. చంద్రబాబు దానికి సానుకూలంగా లేడని సమాచారం. కేఈ తనయుడు ఇప్పటికే హత్యా రాజకీయంతో రచ్చ రేపుకున్నాడు. సొంత నియోజకవర్గంలో వైసీపీ ఇన్ చార్జి హత్యలో కేఈ తనయుడిపై ఆరోపణలున్నాయి. కేసులున్నాయి.

ఈ నేపథ్యంలో కేఈ తనయుడికి టికెట్ ఇవ్వడానికి బాబు సానుకూలంగా లేడని సమాచారం.

ఇక చినరాజప్ప స్థానంలో కమ్మ నేత ఒకరు టికెట్ ఆశిస్తున్నారు. గత ఎన్నికల ముందు వైసీపీలోకి వెళ్లిన ఆయన ఇప్పుడు టీడీపీలోకి మళ్లీ వచ్చి టికెట్ తనది అంటున్నాడు. కమ్మ నేత లాబీయింగ్ ముందు కాపు నేత చిన్నరాజప్ప నిలవలేకపోతున్నాడని టాక్. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎంలిద్దరికీ టికెట్లు దక్కే పరిస్థితి ఉండదని సమాచారం.

First Published:  17 Sep 2018 8:26 AM GMT
Next Story