Telugu Global
Cinema & Entertainment

మలయాళం లోకి కూడా రీమేక్ అవుతున్న “అర్జున్ రెడ్డి”

“అర్జున్ రెడ్డి” ఈ సినిమా రిలీజ్ అయ్యి ఏడాది కావొస్తున్నా కూడా సినిమా తాలూకు పాత్రలు సన్నివేశాలు ఇంకా మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. ఆ రేంజ్ సంచలనం సృష్టించిన సినిమా ఇది. విజయ్ దేవరకొండకి మంచి మాస్ ఫాలోయింగ్ తీసుకొచ్చిన ఈ సినిమా ఇప్పటికే పలు బాషల్లో రీమేక్ అవుతుంది. ఇప్పటికే హిందీలో రీమేక్ అవుతోంది. అలాగే తమిళ్ లో కూడా. ఇక ఇప్పుడేమో మరో దక్షిణాది బాష అయిన మలయాళంలో కూడా రీమేక్ చేయడానికి సన్నాహాలు […]

మలయాళం లోకి కూడా రీమేక్ అవుతున్న “అర్జున్ రెడ్డి”
X

“అర్జున్ రెడ్డి” ఈ సినిమా రిలీజ్ అయ్యి ఏడాది కావొస్తున్నా కూడా సినిమా తాలూకు పాత్రలు సన్నివేశాలు ఇంకా మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. ఆ రేంజ్ సంచలనం సృష్టించిన సినిమా ఇది.

విజయ్ దేవరకొండకి మంచి మాస్ ఫాలోయింగ్ తీసుకొచ్చిన ఈ సినిమా ఇప్పటికే పలు బాషల్లో రీమేక్ అవుతుంది. ఇప్పటికే హిందీలో రీమేక్ అవుతోంది. అలాగే తమిళ్ లో కూడా. ఇక ఇప్పుడేమో మరో దక్షిణాది బాష అయిన మలయాళంలో కూడా రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట “అర్జున్ రెడ్డి” సినిమాని.

హిందీలో షాహిద్ కపూర్ చేస్తుండగా…. తమిళ్ లో విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా నటిస్తున్నాడు. తమిళ్ లో ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సగం పూర్తయింది. హిందీ లో షహీద్ కపూర్ తో ఈ సినిమాని సందీప్ రెడ్డి వంగానే డైరెక్ట్ చేస్తున్నాడు.

ఇక ఇప్పుడు మలయాళంలో విజయ్ దేవరకొండ పాత్రలో నటించేది ఎవరు? అసలు అక్కడ ఈ సినిమాని ఎవరు డైరెక్ట్ చేస్తారు? అనే విషయాలు ఆసక్తికరంగా మారాయి. అన్ని బాషల్లో ఈ సినిమాని రీమేక్ చేస్తున్నారు బానే ఉంది. కానీ అసలు తెలుగు లో హిట్ అయినట్టు అన్ని బాషల్లో ఈ సినిమా సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.

First Published:  17 Sep 2018 12:35 AM GMT
Next Story