Telugu Global
Cinema & Entertainment

ఆ ఎఫైర్ లో నిజం లేదు

తెలుగు-తమిళ్-హిందీ ఇలా లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా దూసుకుపోతోంది శృతిహాసన్. సౌత్ లో ఆమె ఏ సినిమా చేసినా అది హిట్ అవుతోంది. అందుకే ఆమెకు గోల్డెన్ బ్యూటీ అనే బిరుదు కూడా వచ్చింది. కెరీర్ ప్రారంభించి ఇన్నేళ్లయినా ఎప్పుడూ శృతిహాసన్ వ్యక్తిగత జీవితంపై మాత్రం పుకార్లు రాలేదు. స్టార్ డమ్ సంపాదించకముందు హీరో సిద్దార్థ్ తో ఆమె క్లోజ్ గా ఉంటోందంటూ పుకార్లు వచ్చినప్పటికీ… అవి ఇటు మీడియాపై అటు శృతిహాసన్ పై పెద్దగా ప్రభావం […]

ఆ ఎఫైర్ లో నిజం లేదు
X

తెలుగు-తమిళ్-హిందీ ఇలా లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా దూసుకుపోతోంది శృతిహాసన్. సౌత్ లో ఆమె ఏ సినిమా చేసినా అది హిట్ అవుతోంది. అందుకే ఆమెకు గోల్డెన్ బ్యూటీ అనే బిరుదు కూడా వచ్చింది. కెరీర్ ప్రారంభించి ఇన్నేళ్లయినా ఎప్పుడూ శృతిహాసన్ వ్యక్తిగత జీవితంపై మాత్రం పుకార్లు రాలేదు. స్టార్ డమ్ సంపాదించకముందు హీరో సిద్దార్థ్ తో ఆమె క్లోజ్ గా ఉంటోందంటూ పుకార్లు వచ్చినప్పటికీ… అవి ఇటు మీడియాపై అటు శృతిహాసన్ పై పెద్దగా ప్రభావం చూపించలేదు. కానీ తాజాగా వచ్చిన ఓ గాసిప్ మాత్రం పెద్ద సంచలనంగా మారింది.

బాలీవుడ్ టాప్ స్టార్ రణబీర్ కపూర్ తో శృతిహాసన్ డేటింగ్ చేస్తోందనే రూమర్ ఇప్పుడు అందర్నీ అవాక్కయేలా చేసింది. ఎందుకంటే.. ఇప్పటికే రణబీర్ కపూర్.. దీపికా పదుకోన్, కత్రినాకైఫ్ లాంటి తారల్ని మార్చేశాడు. ఇప్పుడు తాజాగా శృతిహాసన్ వెంట పడుతున్నాడనే రూమర్ వినిపిస్తోంది. దీనిపై శృతిహాసన్ ఫ్రెండ్స్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం శృతిపై వస్తున్న రూమర్లలో నిజం లేదంటున్నారు వాళ్లు. అంతేకాదు.. త్వరలోనే మరిన్ని సౌత్ సినిమాలకు సైన్ చేసి.. దక్షిణాదిలోనే సెటిల్ అవ్వాలనే ఆలోచనలో శృతి ఉందంటున్నారు ఆమె ఫ్రెండ్స్.

First Published:  26 Sep 2016 11:38 AM GMT
Next Story