Telugu Global
CRIME

బాలుడితో అక్ర‌మ సంబంధం.. భ‌ర్త‌ను చంపి బైక్ పై తీసుకెళ్లిన భార్య‌!

16 ఏళ్ల బాలుడితో అక్ర‌మ సంబంధం పెట్టుకున్న ఓ మ‌హిళ త‌న భ‌ర్త‌ను ప్రియుడితో క‌లిసి చంపి శ‌వాన్ని బైక్‌పై త‌ర‌లిస్తుండ‌గా పోలీసుల‌కు చిక్కింది. వివ‌రాలు.. హ‌య‌త్‌న‌గ‌ర్‌లో నివ‌సించే పుల్ల‌య్య‌, ప్ర‌వ‌ళ్లిక ఇద్ద‌రూ భార్యాభ‌ర్త‌లు. న‌ల్ల‌గొండ జిల్లా న‌ల్ల‌బండ‌గూడెం వీరి స్వ‌గ్రామం. పుల్ల‌య్య కోదాడ వ్య‌వ‌సాయ మార్కెట్‌లో సూప‌ర్ వైజ‌ర్‌గా ప‌నిచేస్తున్నాడు. ప్ర‌వ‌ళ్లిక‌కు వ‌ర‌సకు అల్లుడు అయ్యే బాలుడు (16)తో వివాహేత‌ర సంబంధం ఏర్ప‌డింది. కొంత‌కాలం బానే సాగింది. కానీ, వీరిద్ద‌రి వ్య‌వ‌హారం తెలుసుకున్న పుల్ల‌య్య భార్య […]

బాలుడితో అక్ర‌మ సంబంధం.. భ‌ర్త‌ను చంపి బైక్ పై తీసుకెళ్లిన భార్య‌!
X
16 ఏళ్ల బాలుడితో అక్ర‌మ సంబంధం పెట్టుకున్న ఓ మ‌హిళ త‌న భ‌ర్త‌ను ప్రియుడితో క‌లిసి చంపి శ‌వాన్ని బైక్‌పై త‌ర‌లిస్తుండ‌గా పోలీసుల‌కు చిక్కింది. వివ‌రాలు.. హ‌య‌త్‌న‌గ‌ర్‌లో నివ‌సించే పుల్ల‌య్య‌, ప్ర‌వ‌ళ్లిక ఇద్ద‌రూ భార్యాభ‌ర్త‌లు. న‌ల్ల‌గొండ జిల్లా న‌ల్ల‌బండ‌గూడెం వీరి స్వ‌గ్రామం. పుల్ల‌య్య కోదాడ వ్య‌వ‌సాయ మార్కెట్‌లో సూప‌ర్ వైజ‌ర్‌గా ప‌నిచేస్తున్నాడు. ప్ర‌వ‌ళ్లిక‌కు వ‌ర‌సకు అల్లుడు అయ్యే బాలుడు (16)తో వివాహేత‌ర సంబంధం ఏర్ప‌డింది. కొంత‌కాలం బానే సాగింది. కానీ, వీరిద్ద‌రి వ్య‌వ‌హారం తెలుసుకున్న పుల్ల‌య్య భార్య ప్ర‌వళ్లిక‌ను మందలించాడు. త‌రువాత మకాం హ‌య‌త్‌న‌గ‌ర్‌కు మార్చాడు. దీంతో వీర‌ద్ద‌రూ క‌లుసుకోవ‌డం క‌ష్టంగా మారింది. అందుకే, త‌మ అక్ర‌మ సంబంధానికి అడ్డువ‌స్తున్న పుల్ల‌య్య‌ను చంపి అడ్డు తొలగించుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ప‌థ‌కం ప్ర‌కారం పుల్ల‌య్య‌ను హ‌త‌మార్చాల‌నుకున్నారు. ఇందులో భాగంగానే శ‌నివారం బాలుడు పుల‌య్య ఇంటికి వ‌చ్చాడు. ఇద్ద‌రూ బాగా మ‌ద్యం తాగారు. త‌రువాత ప్ర‌వ‌ళ్లిక‌, బాలుడు క‌లిసి పుల్ల‌య్య మ‌ర్మాంగాల‌పై దాడి చేశారు. అయినా చావ‌క‌పోవ‌డంతో.. అత‌ని పీక పిసికి ఊపిరాడ‌కుండా చేసి చంపారు. త‌రువాత శ‌వాన్ని న‌గ‌ర శివార్ల‌లో పాతిపెట్టాల‌నుకున్నారు. బైక్‌పై పుల్ల‌య్య శ‌వాన్ని వేసుకుని ఇంటి నుంచి బ‌య‌ల్దేరారు. పెద్ద అంబ‌ర్‌పేట చెక్‌పోస్టు వ‌ద్ద వీరి బైక్‌ను గ‌మ‌నించిన పోలీసులు వెంబ‌డించి ప‌ట్టుకున్నారు. పుల్ల‌య్య శ‌వాన్ని ఉస్మానియా మార్చురీకి త‌ర‌లించారు. నిందితులిద్ద‌రినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్ర‌శ్నిస్తున్నారు.
Next Story