Telugu Global
Cinema & Entertainment

2 సినిమాలు ఓకే చేశాడు... హీరోయిన్స్ మాత్రం లేరు...

ఎన్నడూ లేని విధంగా బన్నీ ఒకేసారి 2 సినిమాలు ఒకే చేశాడు. కానీ ఆశ్చర్యంగా ఆ రెండు సినిమాల్లో హీరోయిన్లను పక్కా చేయలేదు. హరీష్ శంకర్ దర్శకత్వంలో త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు అల్లు అర్జున్. ఈ సినిమా ఇంకొన్ని రోజుల్లో సెట్స్ పైకి వెళ్లబోతోంది. కానీ హీరోయిన్ మాత్రం ఫిక్స్ అవ్వలేదు. పూజా హెగ్డేను హీరోయిన్ గా తీసుకున్నట్టు వార్తలొచ్చినప్పటికీ… మేకర్స్ మాత్రం ఇంకా అఫీషియల్ గా ఆ విషయాన్ని నిర్థారించలేదు. తాజాగా లింగుస్వామి సినిమా […]

2 సినిమాలు ఓకే చేశాడు... హీరోయిన్స్ మాత్రం లేరు...
X

ఎన్నడూ లేని విధంగా బన్నీ ఒకేసారి 2 సినిమాలు ఒకే చేశాడు. కానీ ఆశ్చర్యంగా ఆ రెండు సినిమాల్లో హీరోయిన్లను పక్కా చేయలేదు. హరీష్ శంకర్ దర్శకత్వంలో త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు అల్లు అర్జున్. ఈ సినిమా ఇంకొన్ని రోజుల్లో సెట్స్ పైకి వెళ్లబోతోంది. కానీ హీరోయిన్ మాత్రం ఫిక్స్ అవ్వలేదు. పూజా హెగ్డేను హీరోయిన్ గా తీసుకున్నట్టు వార్తలొచ్చినప్పటికీ… మేకర్స్ మాత్రం ఇంకా అఫీషియల్ గా ఆ విషయాన్ని నిర్థారించలేదు. తాజాగా లింగుస్వామి సినిమా విషయంలో కూడా అదే జరుగుతోంది. లింగుస్వామి దర్శకత్వంలో తెలుగు-తమిళ భాషల్లోఓ సినిమా చేసేందుకు బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ను తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. కానీ ఆ విషయాన్ని మేకర్స్ ఇంకా పక్కా చేయలేదు. గతంలో రామ్ తో కలిసి నేను శైలజ సినిమాలో నటించింది కీర్తి సురేష్. అటు పూజా హెగ్డే, ఇటు కీర్తి సురేష్… ఇద్దరూ ప్రస్తుతం బన్నీ కోసం వెయిట్ చేస్తున్నారు. మరి వీళ్లలో బన్నీ ఎవరికి ఓటేస్తాడు.. ఎవర్ని పక్కనపెడతాడు అనే విషయం త్వరలోనే తేలిపోతుంది.

First Published:  25 Sep 2016 11:46 AM GMT
Next Story