Telugu Global
Cinema & Entertainment

‘శృతి’ మించిన స్టైల్

శృతి హాసన్ పేరు ఇప్పుడు టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయింది. శృతి హాసన్ ఏ ఈవెంట్ కి వెళ్లినా అందరి చూపు ఆమె మీదనే ఉంటుంది. ఆమె అందానికి, స్టైల్ కి అంతలా ఫిదా అవుతున్నారు ఆడియన్స్.  హీరోయిన్స్ ఎక్కువగా సినిమాల్లోనే స్టైల్స్ ఫాలో అవుతుంటారు కానీ శృతి హాసన్ స్టైల్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటుంది. ఇప్పుడిప్పుడే హాలీవుడ్ కి ఏ మాత్రం తక్కువ కాకుండా బాలీవుడ్ తారలు తమ డ్రెస్సింగ్ స్టైల్ […]

‘శృతి’ మించిన స్టైల్
X
శృతి హాసన్ పేరు ఇప్పుడు టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయింది. శృతి హాసన్ ఏ ఈవెంట్ కి వెళ్లినా అందరి చూపు ఆమె మీదనే ఉంటుంది. ఆమె అందానికి, స్టైల్ కి అంతలా ఫిదా అవుతున్నారు ఆడియన్స్. హీరోయిన్స్ ఎక్కువగా సినిమాల్లోనే స్టైల్స్ ఫాలో అవుతుంటారు కానీ శృతి హాసన్ స్టైల్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటుంది. ఇప్పుడిప్పుడే హాలీవుడ్ కి ఏ మాత్రం తక్కువ కాకుండా బాలీవుడ్ తారలు తమ డ్రెస్సింగ్ స్టైల్ మార్చుకొంటుంటే, శృతి హాసన్ మాత్రం హాలీవుడ్ స్టైల్ ని అచ్చంగా దింపేస్తుంది. ప్రతీ ఈవెంట్ లో శృతి హాసన్ డ్రెస్సింగ్ స్టైల్ ‘సెంటర్ ఆఫ్ అట్రాక్షన్’ గా నిలుస్తుంది. తన బాడీ కి ఫిట్ అయ్యే డ్రెస్సింగ్ స్టైల్ తో అందరిని ఎట్రాక్ట్ చేస్తోంది శృతి. ప్రేమమ్ మూవీ ఆడియో లాంచ్ లో కూడా అందరి కళ్ళు శృతి హాసన్ మీదనే ఉన్నాయి. అంతలా అందరిని తన స్టైల్ తో కట్టిపడేసింది శృతి హాసన్.
ప్రస్తుతం సూర్యతో సింగం 3 ,నాగ చైతన్యతో ప్రేమమ్, కమల్ హాసన్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న శభాష్ నాయుడు లో నటిస్తుంది శృతి. శభాష్ నటుడు సినిమాలో రియల్ లైఫ్ క్యారెక్టర్ అంటే కమల్ కి కూతురు గా చేస్తుంది శృతి హాసన్. తండ్రిలాగే మల్టిటాలెంటెడ్, సింగర్, యాక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకొన్న శృతి హాసన్… ఫ్యాషన్స్ లో మాత్రం కాస్త శృతిమించుతుందేమో అనిపిస్తోంది.
First Published:  21 Sep 2016 1:22 PM GMT
Next Story