Telugu Global
Cinema & Entertainment

ఫ్లాప్ అన్నారు... కానీ సేఫ్ జోన్ చేరుకుంది...

స్టార్ హీరోల సినిమాలకున్న అడ్వాంటేజ్ ఇది. ఫ్లాప్ టాక్ వచ్చినా తట్టుకొని నిలబడగలిగే స్టామినా స్టార్ హీరోలకు మాత్రమే ఉంటుంది. సినిమాలో ఏమాత్రం స్టఫ్ ఉన్నా దాన్ని తీసుకెళ్లి సేఫ్ జోన్ లో పడేస్తారు. ఈమధ్య కాలంలో చాలా సినిమాలు ఇలానే నెెగెటివ్ టాక్ నుంచి కూడా లాభాలు ఆర్జించాయి. ప్రస్తుతం ఈ జాబితాలోకి విక్రమ్ నటించిన ఇంకొక్కడు సినిమా కూడా చేరిపోయింది. తెలుగులోనే కాదు… తమిళనాట కూడా ఈ సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చింది. విక్రమ్ […]

ఫ్లాప్ అన్నారు... కానీ సేఫ్ జోన్ చేరుకుంది...
X

స్టార్ హీరోల సినిమాలకున్న అడ్వాంటేజ్ ఇది. ఫ్లాప్ టాక్ వచ్చినా తట్టుకొని నిలబడగలిగే స్టామినా స్టార్ హీరోలకు మాత్రమే ఉంటుంది. సినిమాలో ఏమాత్రం స్టఫ్ ఉన్నా దాన్ని తీసుకెళ్లి సేఫ్ జోన్ లో పడేస్తారు. ఈమధ్య కాలంలో చాలా సినిమాలు ఇలానే నెెగెటివ్ టాక్ నుంచి కూడా లాభాలు ఆర్జించాయి. ప్రస్తుతం ఈ జాబితాలోకి విక్రమ్ నటించిన ఇంకొక్కడు సినిమా కూడా చేరిపోయింది. తెలుగులోనే కాదు… తమిళనాట కూడా ఈ సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చింది. విక్రమ్ గెటప్ తప్పితే సినిమాలో చెప్పుకోవడానికి ఏమీలేదన్నారు. అలా బ్యాడ్ టాక్ తో మొదలైన ఇంకొక్కడు సినిమా ప్రస్తుతం సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయింది. పెట్టిన పెట్టుబడిని బయ్యర్లు సంపాదించుకున్నారు. మొన్న ఆదివారం నుంచి ఈ సినిమా లాభాల్లోకి వచ్చింది. తెలుగులో ఈ సినిమాను చాలా చోట్ల ఎత్తేసినా, తమిళనాట మాత్రం చాలా థియేటర్లలో ఇది ఇంకా కొనసాగుతోంది. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లు అంతా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అలా ఇంకొక్కడు సినిమా ఓ ప్రాఫిటబుల్ వెంచర్ గా మారింది. అయితే సినిమాకు లాభాలు వచ్చినా… విక్రమ్ కెరీర్ లో మాత్రం ఇది హిట్ అనిపించుకోదు. ఎందుకంటే.. ఇలా ముక్కీమూలిగి హిట్ అనిపించుకునే స్థాయి కాదు విక్రమ్ ది. కొడితే చరిత్రలో నిలిచియేలా హిట్ కొట్టే రేంజ్ అతడిది. అలాంటి హిట్ కోసం కొన్నేళ్లుగా ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు చియాన్. కానీ ఏదీ చేతికి అంది రావడం లేదు. కనీసం నెక్ట్స్ సినిమాతోనైనా స్టార్ రేసులోకి వస్తాడేమో చూడాలి.

First Published:  20 Sep 2016 3:31 AM GMT
Next Story