Telugu Global
Cinema & Entertainment

బాయ్ ఫ్రెండ్ తో పండగ చేసుకున్న నయన్

దర్శకుడు విఘ్నేష్, నయన్ మధ్య ఏదో ఉందనే పుకారు చాన్నాళ్లుగానే నడుస్తోంది. ఓ అవార్డు ఫంక్షన్ లో స్వయంగా బన్నీ అవార్డు ఇస్తుంటే.. వద్దని విఘ్నేష్ చేతుల మీదుగా అందుకుంది నయనతార. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఏకాంతంగా గడిపిన క్షణాలు కూడా చాలామందికి తెలుసు. తాజాగా నయనతార, తన బాయ్ ఫ్రెండ్ తో పండగ చేసుకుంది. మలయాళీలకు అత్యంత ప్రీతిపాత్రమైన ఓనమ్ పండను విఘ్నేష్ తో కలిసి సెలబ్రేట్ చేసుకుంది. ఈ పండగకు ప్రత్యేకంగా విఘ్నేష్ […]

బాయ్ ఫ్రెండ్ తో పండగ చేసుకున్న నయన్
X

దర్శకుడు విఘ్నేష్, నయన్ మధ్య ఏదో ఉందనే పుకారు చాన్నాళ్లుగానే నడుస్తోంది. ఓ అవార్డు ఫంక్షన్ లో స్వయంగా బన్నీ అవార్డు ఇస్తుంటే.. వద్దని విఘ్నేష్ చేతుల మీదుగా అందుకుంది నయనతార. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఏకాంతంగా గడిపిన క్షణాలు కూడా చాలామందికి తెలుసు. తాజాగా నయనతార, తన బాయ్ ఫ్రెండ్ తో పండగ చేసుకుంది. మలయాళీలకు అత్యంత ప్రీతిపాత్రమైన ఓనమ్ పండను విఘ్నేష్ తో కలిసి సెలబ్రేట్ చేసుకుంది. ఈ పండగకు ప్రత్యేకంగా విఘ్నేష్ ను ఆహ్వానించారు నయనతార కుటుంబీకులు. నయనతార-విఘ్నేష్ కలిసి ఓనమ్ పండగను మరింత కలర్ ఫుల్ గా మార్చేశారట. మరోవైపు నయన్ కుటుంబీకులు కూడా విఘ్నేష్ ను తమ అల్లుడిగా అంగీకరించినట్టు తెలుస్తోంది. శింబు తో విడిపోయాక ప్రభుదేవా…. ప్రభుదేవా నుండి విడిపోయాక విగ్నేష్ ప్రేమలో పడింది నయనతార . త్వరలోనే ఈ ఇద్దరూ పెళ్లి చేసుకుంటారనే ప్రచారం కూడా సాగుతోంది. కానీ వీళ్ళిద్దరూ మాత్రం ఏం చెప్పడం లేదు. అయితే ఎక్కడికి వెళ్ళినా జంటగా వెళుతున్నారు. గాసిప్ రాయుళ్లకు కావాల్సినంత స్టఫ్ అందిస్తున్నారు.

First Published:  15 Sept 2016 10:55 PM GMT
Next Story