Telugu Global
NEWS

ఎంపీ తోట దంపతుల ప్రత్యేక ఫ్యామిలీ డ్రామా

ఏ పార్టీ గెలిచినా గ్రిప్ తమ చేతుల్లోనే ఉండాలనుకునే కుటుంబాలను చూశాం. అందుకే తమ్ముడు ఒక పార్టీలో, అన్న మరో పార్టీలో హవా చేలాయిస్తుంటారు. అయితే ఇప్పుడు టీడీపీ ఎంపీ తోట నరసింహం కుటుంబం మరో అడుగు ముందుకేసింది. ప్రత్యేక హోదా విషయంలో రసవత్తరమైన డ్రామా నడుపుతున్నారు. భర్త ఒకవైపు, భార్య ఒకవైపు అన్నట్టుగా ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజ్‌పై జనం చెవిలో వత్రం చేసి పూలు పెడుతున్నారు. ప్రత్యేక హోదా కాకుండా ప్రత్యేక ప్యాకేజ్‌ను కేంద్రం […]

ఎంపీ తోట దంపతుల ప్రత్యేక ఫ్యామిలీ డ్రామా
X

ఏ పార్టీ గెలిచినా గ్రిప్ తమ చేతుల్లోనే ఉండాలనుకునే కుటుంబాలను చూశాం. అందుకే తమ్ముడు ఒక పార్టీలో, అన్న మరో పార్టీలో హవా చేలాయిస్తుంటారు. అయితే ఇప్పుడు టీడీపీ ఎంపీ తోట నరసింహం కుటుంబం మరో అడుగు ముందుకేసింది. ప్రత్యేక హోదా విషయంలో రసవత్తరమైన డ్రామా నడుపుతున్నారు. భర్త ఒకవైపు, భార్య ఒకవైపు అన్నట్టుగా ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజ్‌పై జనం చెవిలో వత్రం చేసి పూలు పెడుతున్నారు. ప్రత్యేక హోదా కాకుండా ప్రత్యేక ప్యాకేజ్‌ను కేంద్రం ఇవ్వడాన్ని చంద్రబాబుతోపాటు ఎంపీ తోట కూడా స్వాగతించారు.

అయితే తాను స్వాగతించినా జనం మాత్రం రగిలిపోతున్న విషయం ఆయనకు తెలుసు. అందుకే సరికొత్త ఎత్తు వేశారు. భర్త ప్యాకేజ్‌ సూపర్ అంటుంటే ఆయన భార్య తోట వాణి మాత్రం ప్రత్యేక హోదా కోసం లలితా సహస్రనామ పారాయణం మొదలుపెట్టారు. శుక్రవారం కాకినాడ టీటీడీ కల్యాణ మండపంలో ఇందుకు భారీ ఏర్పాట్లు చేశారు. నగరంలోని ప్రధాన కూడళ్లలో తోట దంపతుల ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. ప్రత్యేక హోదా కోసం ఈ కార్యక్రమం చేస్తున్నట్టు వాటిపై రాశారు. తోట దంపతుల ఎత్తులు చూసి జనం అవాక్కవుతున్నారు. ప్యాకేజ్‌ను స్వాగతించేది టీడీపీ నేతలే, ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నామని కలరింగ్‌ ఇచ్చేదీ టీడీపీనేతలేనా అని నవ్వుకుంటున్నారు. లలితా సహస్రనామ పారాయణం వెనుక మరో కారణం కూడా ఉందని చెబుతున్నారు. త్వరలోనే కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికలు జరగనున్నాయి. వాటితో పాగా వేసేందుకే జనంపైకి భక్తి పుష్పాలు విసురుతున్నారని చెప్పుకుంటున్నారు.

Click on Image to Read:

nayeem-political-leaders-1

uma-reddy-venkateswarlu

jaleel-khan

devineni-nehru

andhra-pradesh-capital-city

chittoor-mayor-katari-anuradha

ap-special-status-survy

rosaiah

renudesai-1

chandrababu-naidu-polavaram

mudragada-chandrababu-naidu

First Published:  15 Sep 2016 10:55 PM GMT
Next Story