Telugu Global
Cinema & Entertainment

ఇప్పుడిది పక్కా... బన్నీ హీరోయిన్ ఫైనల్...

కొన్ని రోజులుగా ఊరిస్తున్న బన్నీ భామ పక్కా అయింది. ఈ మేరకు దువ్వాడ జగన్నాధమ్ యూనిట్ క్లారిటీ ఇచ్చేసింది. ముకుంద, ఒక లైలా కోసం సినిమాల్లో నటించిన పూజా హెగ్డేను బన్నీ సరసన హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ మేరకు అగ్రిమెంట్ పై పూజా హెగ్డే సంతకం చేసింది. త్వరలోనే సినిమా సెట్స్ పైకి రాబోతోంది. నిజానికి ఈ సినిమాలో మొదట హీరోయిన్ గా కాజల్ ను అనుకున్నారు. కానీ ఎన్నో లెక్కలు వేసుకున్న తర్వాత కాజల్ […]

ఇప్పుడిది పక్కా... బన్నీ హీరోయిన్ ఫైనల్...
X

కొన్ని రోజులుగా ఊరిస్తున్న బన్నీ భామ పక్కా అయింది. ఈ మేరకు దువ్వాడ జగన్నాధమ్ యూనిట్ క్లారిటీ ఇచ్చేసింది. ముకుంద, ఒక లైలా కోసం సినిమాల్లో నటించిన పూజా హెగ్డేను బన్నీ సరసన హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ మేరకు అగ్రిమెంట్ పై పూజా హెగ్డే సంతకం చేసింది. త్వరలోనే సినిమా సెట్స్ పైకి రాబోతోంది. నిజానికి ఈ సినిమాలో మొదట హీరోయిన్ గా కాజల్ ను అనుకున్నారు. కానీ ఎన్నో లెక్కలు వేసుకున్న తర్వాత కాజల్ కంటే పూజా హెగ్డేనే బెటర్ అని ఫిక్స్ అయ్యారు. గతంలో కాజల్-బన్నీ కలిసి ఆర్య-2, ఎవడు సినిమాలు చేశారు. హ్యాట్రిక్ కాంబినేషన్ సెట్స్ పైకి వస్తుందని అంతా ఎక్స్ పెక్ట్ చేసినప్పటికీ…. ఫ్రెష్ కాంబినేషన్ అయితేనే బెటరని బన్నీ భావించాడట.

ప్రస్తుతం డీజే ప్రాజెక్టుకు సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. దర్శకుడు హరీష్ శంకర్ సూచనల మేరకు అల్లు అర్జున్ ఓ కొత్త మేకోవర్ కోసం ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. వచ్చేనెల నుంచి ఇది సెట్స్ పైకి వస్తుంది. సినిమాలో సెకెండ్ హీరోయిన్ కు కూడా చోటుంది. మరి ఆ భామ ఎవరనేది త్వరలోనే తేలనుంది. వరుసగా మూడు విజయాలతో హ్యాట్రిక్ కొట్టిన హీరోగా పేరుతెచ్చుకున్నాడు బన్నీ. మరోవైపు వరుసగా 3 ఫ్లాపులతో ఫ్లాప్ హీరోయిన్ అనిపించుకుంది పూజా. ఇప్పుడీ ఇద్దరి కాంబినేషన్ లో డీజే వస్తోంది.

First Published:  15 Sep 2016 4:53 AM GMT
Next Story