Telugu Global
Cinema & Entertainment

‘బాహుబలి-2’ ప్రాజెక్ట్ నుండి రానా ఔట్

మీరు చదివింది నిజమే….’బాహుబలి-2′ ప్రాజెక్టు షూటింగ్ నుండి రానా ఔట్ అయ్యాడు. అందుకు కారణం…. మరేదో ఊహించుకోవద్దు. రానా షూటింగ్ పార్టు పూర్తవ్వడమే. ఈ విషయాన్ని రానా స్వయంగా వెల్లడించారు. ‘బాహుబలి’ ఫస్టు పార్టుతో కలిపి చూస్తే…. షూటింగ్ గత మూడేళ్లుగా జరుగుతోంది. సినిమాలో హీరో ప్రభాస్‌, విలన్‌ రానా కీలకం కాబట్టి ఇద్దరూ ఇంతకాలం కలిసి పని చేసారు. దాదాపు మూడేళ్ల అనంతరం ‘బాహుబలి’ నుంచి విముక్తి లభించడంపై చాలా ఆనందంగా ఉన్నాడు రానా.  బాహుబలి […]

‘బాహుబలి-2’ ప్రాజెక్ట్ నుండి రానా ఔట్
X

మీరు చదివింది నిజమే….’బాహుబలి-2′ ప్రాజెక్టు షూటింగ్ నుండి రానా ఔట్ అయ్యాడు. అందుకు కారణం…. మరేదో ఊహించుకోవద్దు. రానా షూటింగ్ పార్టు పూర్తవ్వడమే. ఈ విషయాన్ని రానా స్వయంగా వెల్లడించారు. ‘బాహుబలి’ ఫస్టు పార్టుతో కలిపి చూస్తే…. షూటింగ్ గత మూడేళ్లుగా జరుగుతోంది. సినిమాలో హీరో ప్రభాస్‌, విలన్‌ రానా కీలకం కాబట్టి ఇద్దరూ ఇంతకాలం కలిసి పని చేసారు. దాదాపు మూడేళ్ల అనంతరం ‘బాహుబలి’ నుంచి విముక్తి లభించడంపై చాలా ఆనందంగా ఉన్నాడు రానా.

బాహుబలి రెండో భాగం షూటింగ్‌ దాదాపు పూర్తయింది. కేవలం పాటలు, కొంత ప్యాచ్‌ వర్క్‌ మాత్రమే మిగిలి ఉన్నాయి. పాటల్లో రానా అవసరం ఉండదు కాబట్టి రానా ప్రభాస్ కంటే ముందే బయట పడ్డాడు. తన తర్వాతి సినిమా ప్రారంభం కావడానికి కొంత సమయం ఉండటంతో కాస్త రిలాక్స్ అవుతున్నాడు.

First Published:  14 Sep 2016 11:21 PM GMT
Next Story