Telugu Global
Cinema & Entertainment

వేట మొదలైంది... ఇక ఎవరూ ఆపలేరు...

ఇది చెప్పుకోడానికి ఒక సినిమా డైలాగే కానీ… ఇప్పుడీ డైలాగ్ వాడడం వెనక మాత్రం ఓ కారణం ఉంది. అవును… అఖిల్ కోసం హీరోయిన్ వేట మొదలైంది. ఇది ఎప్పుడు, ఎక్కడ ఆగుతుందో ఎవరికీ తెలీదు. లేకలేక రెండో సినిమాకు ఓకే చెప్పాడు అఖిల్. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో త్వరలోనే ఇది సెట్స్ పైకి రాబోతోంది. రెండో సినిమాను సెట్స్ పైకి తీసుకురావడానికి చాలా లెక్కలు వేసిన అఖిల్… ఇప్పుడు హీరోయిన్ ను సెలక్ట్ చేసే విషయంలో […]

వేట మొదలైంది... ఇక ఎవరూ ఆపలేరు...
X

ఇది చెప్పుకోడానికి ఒక సినిమా డైలాగే కానీ… ఇప్పుడీ డైలాగ్ వాడడం వెనక మాత్రం ఓ కారణం ఉంది. అవును… అఖిల్ కోసం హీరోయిన్ వేట మొదలైంది. ఇది ఎప్పుడు, ఎక్కడ ఆగుతుందో ఎవరికీ తెలీదు. లేకలేక రెండో సినిమాకు ఓకే చెప్పాడు అఖిల్. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో త్వరలోనే ఇది సెట్స్ పైకి రాబోతోంది. రెండో సినిమాను సెట్స్ పైకి తీసుకురావడానికి చాలా లెక్కలు వేసిన అఖిల్… ఇప్పుడు హీరోయిన్ ను సెలక్ట్ చేసే విషయంలో కూడా అంతే సీరియస్ గా ఉన్నాడు. కేవలం టాలీవుడ్ కే ఫిక్స్ అవ్వకుండా… తెలుగు, తమిళ, మలయాళం, బాలీవుడ్ పరిశ్రమలకు చెందిన ముద్దుగుమ్మల జాబితాను తిరగేస్తున్నారు. అయితే ఇప్పటికే జెండా పాతేసిన భామల్ని కాకుండా… అఖిల్ సరసన కొత్తమ్మాయిని తీసుకోమని నాగార్జున సలహా ఇస్తున్నాడు. అయితే విక్రమ్ కుమార్ మాత్రం కొత్తమ్మాయిని తీసుకొని ట్రయిన్ చేసేకంటే కాస్త అనుభవం ఉన్న హీరోయిన్ ను తీసుకుంటే పని సులభం అవుతుందని భావిస్తున్నాడు. ఎందుకంటే… విక్రమ్ కుమార్ సినిమాలన్నీ కాస్త టిపికల్ గా ఉంటాయి. అఖిల్ తో చేయబోయే సినిమా కూడా అలాంటి టిపికల్ సబ్జెక్టే. అందుకే మరీ సీనియర్ కాకుండా.. అలా అని మరీ కొత్తముఖం కాకుండా ఉండే అమ్మాయి కోసం వెదుకుతున్నారు.

First Published:  15 Sep 2016 4:54 AM GMT
Next Story