Telugu Global
Cinema & Entertainment

ఇదేంటీ ఇలా ఉన్నాడు...!? మరీ వెరైటీ లుక్ లో అమీర్ ఖాన్

బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ అమీర్ ఖాన్‌ మరో కొత్త లుక్‌లో కనిపించనున్నాడు. తన పాత మేనేజ అద్వైత్ చందన్ దర్శకుడిగా పరిచయం అవుతున్న కొత్త సినిమాలో ఆయన అతిథి పాత్రలో నటిస్తుండగా, ఇందులో ఆయనకు సంబంధించిన లుక్‌ ఒకటి సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. లగాన్ సినిమా నుంచి పీకే వరకు ఎన్నో ప్రయోగాలు చేశాడు ఆమీర్. త్రీ ఇడియట్స్‌లో స్టూడెంట్‌గా నటించినా.. పీకేలో ఏలియన్‌గా కనిపించినా తన మార్కు నటనను చూపించాడు. తాజాగా దంగల్‌లో నటిస్తున్నాడు. […]

ఇదేంటీ ఇలా ఉన్నాడు...!? మరీ వెరైటీ లుక్ లో అమీర్ ఖాన్
X

బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ అమీర్ ఖాన్‌ మరో కొత్త లుక్‌లో కనిపించనున్నాడు. తన పాత మేనేజ అద్వైత్ చందన్ దర్శకుడిగా పరిచయం అవుతున్న కొత్త సినిమాలో ఆయన అతిథి పాత్రలో నటిస్తుండగా, ఇందులో ఆయనకు సంబంధించిన లుక్‌ ఒకటి సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. లగాన్ సినిమా నుంచి పీకే వరకు ఎన్నో ప్రయోగాలు చేశాడు ఆమీర్. త్రీ ఇడియట్స్‌లో స్టూడెంట్‌గా నటించినా.. పీకేలో ఏలియన్‌గా కనిపించినా తన మార్కు నటనను చూపించాడు. తాజాగా దంగల్‌లో నటిస్తున్నాడు. ఈ లుక్ కూడా అద్బుతంగా ఉందంటూ మంచి రెస్పాన్సే వచ్చింది. అయితే డిసెంబర్ లో దంగల్ రానుండగా…. గతంలో తన దగ్గర మేనేజర్ గా పని చేసిన చందన్ కోరిక మేరకు అతను తీస్తున్న ఓ సినిమాలో కొద్దిసేపు కనిపిస్తాడట.

పొడవైన మీసకట్టు, వింత గడ్డం, విచిత్రమైన జ్యూవెలరీతో అమీర్ లుక్ ఫన్నీగా ఉంది. తలకి ఒక హెడ్ గేర్ కూడా కనిపిస్తోంది. ఇందులో ఆయన మ్యూజిక్‌ మెంటర్‌ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. పేరుకు అతిథి పాత్రే అయినా ఈ సినిమాలో ఆమిర్ చాలా సేపు తెర మీద కనిపించనున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమా అయిపోతే అమితాబ్ తో కలిసి చేయనున్న థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ మొదలు కానుంది. సోలో హీరోగానే ఒక రేంజ్ హిట్ కొట్టే అమీర్ ఇక ఇండియన్ మూవీ బాద్షాతో చేతులు కలిపితే ఇంకెలా ఉంటుందో ఊహించండి. అమీర్ ఖాన్, అమితాబ్ ఒకే తెర మీద.. ఆమీర్‌ ఖాన్‌ చేసిన ట్వీట్‌తో ఆ విషయం ఖరారైంది. అమితాబ్‌తో కలసి నటిస్తుండటం ఆనందంగా ఉందంటూ ఆమీర్‌ ట్వీట్‌ చేశారు. ”నేనెంత కాలంగానో ఎదురుచూస్తున్న సమయం ఎట్టకేలకు వచ్చేసింది. అమితాబ్‌తో కలసి నటించాలన్న కోరిక నెరవేరబోతోంది.జీవితంలో అనుక్షణం నేను ఆరాధించిన వ్యక్తితో తెరను పంచుకోబోతుండటం ఉద్వేగంగా ఉంది.అందుకు ఆదిత్య చోప్రా, విజయ్‌కృష్ణలకు ధన్యవాదాలు. చిత్రీకరణ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అంటూ…. మొన్న చేసిన ట్వీట్ కే అభిమానులు ఉత్సాహంగా ఉంటే ఇప్పుడు వచ్చిన ఈ సీక్రేట్ సూపర్ స్టార్ లుక్ అమీర్ అభిమానుల్లో మరింత ఉత్సాహం తెచ్చింది.

First Published:  14 Sep 2016 10:48 PM GMT
Next Story