Telugu Global
Cinema & Entertainment

ఇకపై రాజు-మంత్రి అన్నీ రానానే....

ప్రస్తుతం బాహుబలి-2 షూటింగ్ లో రానా బిజీగా ఉన్నాడు. సినిమాలో భల్లాలదేవగా, రాజు పాత్రలో నెగెటివ్ షేడ్స్ లో రానా పర్ ఫెక్ట్ గా సూట్ అయిపోయాడు. అయితే ఇకపై తను రాజును మాత్రమే కాదు… మంత్రిని కూడా అంటున్నాడు రానా. నిజమే… రాజు మంత్రి అన్నీ రానానే. అయితే బాహుబలి-2లో మాత్రం కాదు. కొత్త సినిమాలో రానా పాత్ర ఈ టైపులోనే సాగుతుంది. సినిమాకు టైటిల్ కూడా ఇదే పెట్టారు. ప్రస్తుతం తేజ దర్శకత్వంలో ఓ […]

ఇకపై రాజు-మంత్రి అన్నీ రానానే....
X
ప్రస్తుతం బాహుబలి-2 షూటింగ్ లో రానా బిజీగా ఉన్నాడు. సినిమాలో భల్లాలదేవగా, రాజు పాత్రలో నెగెటివ్ షేడ్స్ లో రానా పర్ ఫెక్ట్ గా సూట్ అయిపోయాడు. అయితే ఇకపై తను రాజును మాత్రమే కాదు… మంత్రిని కూడా అంటున్నాడు రానా. నిజమే… రాజు మంత్రి అన్నీ రానానే. అయితే బాహుబలి-2లో మాత్రం కాదు. కొత్త సినిమాలో రానా పాత్ర ఈ టైపులోనే సాగుతుంది. సినిమాకు టైటిల్ కూడా ఇదే పెట్టారు. ప్రస్తుతం తేజ దర్శకత్వంలో ఓ పొలిటికల్ సైటైరిక్ మూవీలో రానా హీరోగా నటిస్తున్నాడు. కాజల్, క్యాథరీన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు నేనే రాజు… నేనే మంత్రి అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. చిత్రం మూవీస్ బ్యానర్ పై ఇదే టైటిల్ ను రిజిస్టర్ చేశారు. సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇప్పుడు మరింత ఊపందుకోనుంది. ఎందుకంటే… మూడేళ్లుగా బాహుబలి ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టిన రానా… ఇప్పుడు ఆ మెగా వెంచర్ నుంచి బయటకొచ్చాడు. సో… ఇకపై తేజ సినిమాపైనే దృష్టిపెట్టబోతున్నాడు. కాబట్టి… అతి త్వరలో ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని త్వరలోనే థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది.
First Published:  14 Sep 2016 6:45 AM GMT
Next Story