Telugu Global
NEWS

విమోచ‌నం విష‌యంలో బీజేపీకి మరో ఝ‌ల‌క్‌!

సెప్టెంబ‌రు 17 విష‌యంలో బీజేపీకి మ‌రో ఎదురుదెబ్బ తగిలింది. ఆ రోజును విమోచన దినంగా జ‌ర‌పాల‌నే బీజేపీ డిమాండ్‌ను జేఏసీ చైర్మ‌న్ కోదండ‌రాంతోపాటు మేధావులంతా వ్య‌తిరేకించారు. సెప్టెంబ‌రు 17ను విమోచ‌నంగా నిర్వ‌హిస్తే మ‌త‌ప‌ర‌మైన విభేదాలు వస్తాయని టీఆర్ ఎస్ ఆందోళ‌న‌ల‌ను వారంతా స‌మ‌ర్థించారు. దీంతో బీజేపీ గొంతులో ప‌చ్చివెల‌క్కాయ‌ప‌డింది. ఈ విష‌యంలో ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెడ‌తామ‌ని కొంత‌కాలంగా మాట‌ల‌దాడి చేస్తోన్న బీజేపీకి మెజారిటీ వ‌ర్గం మ‌ద్ద‌తు ల‌భించ‌లేదు. అస్స‌లు ఈవిష‌యంలో విమోచ‌నం అన్న డిమాండ్ ను ఒక్క బీజేపీ […]

విమోచ‌నం విష‌యంలో బీజేపీకి మరో ఝ‌ల‌క్‌!
X
సెప్టెంబ‌రు 17 విష‌యంలో బీజేపీకి మ‌రో ఎదురుదెబ్బ తగిలింది. ఆ రోజును విమోచన దినంగా జ‌ర‌పాల‌నే బీజేపీ డిమాండ్‌ను జేఏసీ చైర్మ‌న్ కోదండ‌రాంతోపాటు మేధావులంతా వ్య‌తిరేకించారు. సెప్టెంబ‌రు 17ను విమోచ‌నంగా నిర్వ‌హిస్తే మ‌త‌ప‌ర‌మైన విభేదాలు వస్తాయని టీఆర్ ఎస్ ఆందోళ‌న‌ల‌ను వారంతా స‌మ‌ర్థించారు. దీంతో బీజేపీ గొంతులో ప‌చ్చివెల‌క్కాయ‌ప‌డింది. ఈ విష‌యంలో ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెడ‌తామ‌ని కొంత‌కాలంగా మాట‌ల‌దాడి చేస్తోన్న బీజేపీకి మెజారిటీ వ‌ర్గం మ‌ద్ద‌తు ల‌భించ‌లేదు. అస్స‌లు ఈవిష‌యంలో విమోచ‌నం అన్న డిమాండ్ ను ఒక్క బీజేపీ త‌ప్ప ఎవ‌రూ స‌మ‌ర్థించ‌డం లేదు.
తెలంగాణ సాయుధ పోరాటంలో ఆరెస్సెస్‌కు, బీజేపీకి ఎలాంటి సంబంధం లేద‌ని క‌మ్యూనిస్టులు ఇటీవ‌ల కుండబ‌ద్ద‌లు కొట్టారు. అస్స‌లు ఆ స‌మ‌యంలో జ‌రిగిన సాయుధ పోరాటానికి ఈ రెండు సంస్థ‌ల‌కు సంబంధ‌మే లేద‌న్నారు. అస్స‌లు 30 ఏళ్ల కింద పుట్టిన బీజేపీకి 60 ఏళ్ల కింద‌ట తెలంగాణ ఉద్య‌మం గురించి మాట్లాడే హ‌క్కే లేద‌ని విమ‌ర్శించారు. హిందూ – ముస్లింల మ‌ధ్య గొడ‌వ‌లు పెట్టేందుకే ఇలాంటి వివాదాస్ప‌ద డిమాండ్ ను తెర‌పైకి తీసుకువ‌చ్చార‌ని బీజేపీని ప‌లు వ‌ర్గాలు తీవ్రంగా త‌ప్పుబ‌డుతున్నాయి. అయినా హిందూ ప‌క్ష‌పాతులుగా పేరొందిన క‌మ‌ల‌నాథులు ఈ విష‌యంలో త‌మ వైఖ‌రిని స‌మ‌ర్థించుకోవ‌డం గ‌మ‌నార్హం. మ‌రోవైపు తెలంగాణ‌లో ఉనికిని చాటుకునేందుకు, హిందు-ముస్లింల మ‌ధ్య ఐక్య‌త‌ను దెబ్బ‌తీసేందుకే బీజేపీనేత‌లు ఇలాంటి వివాదాస్ప‌ద డిమాండ్‌ను భుజాల‌కెత్తుకున్నార‌ని గులాబీ నేత‌లు మండిప‌డుతున్నారు. బీజేపీకి తెలంగాణ గురించి మాట్లాడే హ‌క్కేలేద‌ని ఆరోపించారు. తెలంగాణ కోసం రాజీనామా చేయ‌మంటే పారిపోయిన పార్టీ అని ఎగ‌తాళి చేస్తున్నారు. చేత‌నైతే ఒంట‌రిగా ఎన్నిక‌ల్లో పోటీ చేసి గెలిచి అప్పుడు తెలంగాణ గురించి మాట్లాడాల‌ని హిత‌వు ప‌లుకుతున్నారు.
First Published:  12 Sep 2016 7:56 PM GMT
Next Story