Telugu Global
Cinema & Entertainment

మాధురి , ఐశ్వ‌ర్య రాయ్ ల బాట‌లో క‌రీనా క‌పూర్...!

ఒక‌ప్పుడు  హీరోయిన్   గా కెరీర్ సాగించ‌డం అంటే  పెళ్లికి ముందే. పెళ్లి అయితే సినిమాలకు బాయ్ చెప్పి…గృహిణిగా పరిమితం కావ‌డ‌మే.  కానీ ఇప్పుడు ట్రెండ్  మారింది.   పెళ్లి అయిన త‌రువాత కూడా  హీరోయిన్స్ ను ఆడియ‌న్స్   ఆద‌రిస్తున్నారు.  అలాగే   పిల్ల‌లు పుట్టిన త‌రువాత కూడా  త‌మ  ఏజ్ కు  త‌గ్గ రోల్స్ చేసి  మాధురి దీక్షిత్.. ఐశ్వ‌ర్య రాయ్ లు   న‌ట‌న మీద ప్యాష‌న్ వుంటే ఏది  అడ్డంకి కాద‌ని తేల్చేశారు. ఇక తాజాగా ఈ […]

మాధురి , ఐశ్వ‌ర్య రాయ్ ల బాట‌లో క‌రీనా క‌పూర్...!
X

ఒక‌ప్పుడు హీరోయిన్ గా కెరీర్ సాగించ‌డం అంటే పెళ్లికి ముందే. పెళ్లి అయితే సినిమాలకు బాయ్ చెప్పి…గృహిణిగా పరిమితం కావ‌డ‌మే. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. పెళ్లి అయిన త‌రువాత కూడా హీరోయిన్స్ ను ఆడియ‌న్స్ ఆద‌రిస్తున్నారు. అలాగే పిల్ల‌లు పుట్టిన త‌రువాత కూడా త‌మ ఏజ్ కు త‌గ్గ రోల్స్ చేసి మాధురి దీక్షిత్.. ఐశ్వ‌ర్య రాయ్ లు న‌ట‌న మీద ప్యాష‌న్ వుంటే ఏది అడ్డంకి కాద‌ని తేల్చేశారు.

ఇక తాజాగా ఈ వ‌ర‌స‌లో కరీనా క‌పూర్ చేరింది. ఇప్పుడు కరీనా గర్భిణీ అనే విషయం మనకు తెలిసిందే. డిసెంబర్‌లో బిడ్డకు జన్మనిస్తుందని అటు పటౌడీ దంపతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో సాధారణంగా అందరికీ తోచే ప్రశ్నే ఇప్పుడు బెబో కరీనాకీ ఎదురైంది. ప్రసవానంతరం సినిమాల్లో నటిస్తుందా? గృహిణిగా బిడ్డ ఆలనాపాలనతో ఇంటికే పరిమితమవుతుందా? అనే విషయాలు అందరికీ అసక్తిగా మారాయి. ఇలాంటి సందేహాలను బెబో తాజాగా నివృత్తి చేసింది.

‘నేను నటనను ఎంతో ప్రేమిస్తున్నాను. నా వృత్తి నాకు సంతృప్తికరంగా ఉంటుంది. నటనే నా పని. మరి అలాంటప్పుడు నటించటం ఎందుకు మానేయాలి. తల్లిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే నా వృత్తిని నేను కొనసాగిస్తాను’ అని చెప్పింది బెబో. కరీనా ఈ మధ్య ఓ ఫ్యాషన్‌వీక్‌లో నిండు గర్భిణీగా ర్యాంప్‌ వ్యాక్‌ చేసి అందరి దృష్టినీ ఆకర్షించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తల్లి అయిన తర్వాత కూడా నటిస్తానని చెప్పి..నటనపై తనకున్న ఆసక్తిని మరోసారి బయటపెట్టింది.

First Published:  13 Sept 2016 4:31 AM GMT
Next Story