Telugu Global
Cinema & Entertainment

అవసరాల సినిమాపై ప్రముఖుల ప్రశంసలు

ఇటీవల వచ్చిన మనమంతా సినిమాకు సినీపరిశ్రమ అంతా ఏకమై ఎలా అభినందనలు తెలిపిందో… తాజాగా ఇప్పుడు అవసరాల శ్రీనివాస్ తెరకెక్కించిన జ్యో అచ్యుతానంద సినిమాకు కూడా చిత్రప్రముఖులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాను రాజమౌళి ప్రత్యేకంగా మెచ్చుకున్నాడు. తాజాగా సమంత కూడా జ్యో అచ్యుతానంద మూవీని ఆకాశానికెత్తేసింది. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి బాలకృష్ణ కూడా చేరిపోయాడు. ఎంతో ప్రత్యేకమైతే తప్ప మీడియా ముందుకురాని బాలయ్య… జ్యో అచ్యుతానంద సినిమాలో నారా రోహిత్ నటనను […]

అవసరాల సినిమాపై ప్రముఖుల ప్రశంసలు
X

ఇటీవల వచ్చిన మనమంతా సినిమాకు సినీపరిశ్రమ అంతా ఏకమై ఎలా అభినందనలు తెలిపిందో… తాజాగా ఇప్పుడు అవసరాల శ్రీనివాస్ తెరకెక్కించిన జ్యో అచ్యుతానంద సినిమాకు కూడా చిత్రప్రముఖులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాను రాజమౌళి ప్రత్యేకంగా మెచ్చుకున్నాడు. తాజాగా సమంత కూడా జ్యో అచ్యుతానంద మూవీని ఆకాశానికెత్తేసింది. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి బాలకృష్ణ కూడా చేరిపోయాడు. ఎంతో ప్రత్యేకమైతే తప్ప మీడియా ముందుకురాని బాలయ్య… జ్యో అచ్యుతానంద సినిమాలో నారా రోహిత్ నటనను ప్రత్యేకంగా మెచ్చుకున్నాడు. నారా రోహిత్ నటన చాలా బాగా నచ్చిందని, జ్యో అచ్యుతానంద సక్సెస్ కావడం పట్ల సంతోషంగా ఉన్నానని తెలుపుతూ నారా రోహిత్ ఇలాంటి మరెన్నో మంచి సినిమాలు చేయాలని బాలయ్య కోరుకున్నారు. సాయి కొర్రపాటి నిర్మాణంలో తెరకెక్కిన జ్యో అచ్యుతానంద సినిమాలో రెజీనా హీరోయిన్‌గా నటించారు. నారా రోహిత్, నాగశౌర్య హీరోలుగా నటించారు. ప్రస్తుతం ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా మంచి పాజిటివ్ టాక్ తో నడుస్తోంది.

First Published:  11 Sept 2016 12:53 AM GMT
Next Story