Telugu Global
Cinema & Entertainment

చైతూ సినిమాకు దేవిశ్రీ సంగీతం...

ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాడు దేవిశ్రీప్రసాద్. ఎంత బిజీ అంటే… తనకు టైం లేదనే కారణంతో ఏకంగా బాలయ్య ప్రతిష్టాత్మక వందో సినిమాను కూడా పక్కనపెట్టేశాడు. గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా నుంచి తప్పుకున్నాడు. ప్రస్తుతం చిరంజీవి 150వ సినిమాకు సంగీతం అందిస్తుండడంతో పాటు మరిన్ని క్రేజీ ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి. ఇంత బిజీ టైం లో కూడా నాగచైతన్య సినిమాకు సంగీతం అందించేందుకు దేవిశ్రీ ప్రసాద్ ఒప్పుకున్నాడు. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న నాగచైతన్య […]

చైతూ సినిమాకు దేవిశ్రీ సంగీతం...
X

ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాడు దేవిశ్రీప్రసాద్. ఎంత బిజీ అంటే… తనకు టైం లేదనే కారణంతో ఏకంగా బాలయ్య ప్రతిష్టాత్మక వందో సినిమాను కూడా పక్కనపెట్టేశాడు. గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా నుంచి తప్పుకున్నాడు. ప్రస్తుతం చిరంజీవి 150వ సినిమాకు సంగీతం అందిస్తుండడంతో పాటు మరిన్ని క్రేజీ ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి. ఇంత బిజీ టైం లో కూడా నాగచైతన్య సినిమాకు సంగీతం అందించేందుకు దేవిశ్రీ ప్రసాద్ ఒప్పుకున్నాడు. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న నాగచైతన్య సినిమాకు దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించబోతున్నాడు. ఈ విషయాన్ని నాగార్జున స్వయంగా ప్రకటించాడు. కల్యాణ్ కృష్ణ-నాగచైతన్య కాంబినేషన్ లో సినిమాను అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ పై తెరకెక్కించనున్నట్టు ప్రకటించిన నాగ్…ఆ ప్రాజెక్టుకు దేవీనే మ్యూజిక్ కంపోజ్ చేస్తాడని ప్రకటించాడు. ఇందులో నాగచైతన్య సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించనుంది. జగపతి బాబు, రావు రమేష్, సాయికుమార్, సంపత్, అజయ్ లాంటి భారీ తారాగణం నటించబోతోంది. చూస్తుంటే… ఈ సినిమాను నిర్మాత నాగార్జున కాస్త భారీ బడ్జెట్ తో, ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నట్టు కనిపిస్తోంది.

First Published:  9 Sep 2016 10:40 PM GMT
Next Story