Telugu Global
Cinema & Entertainment

డిస్ట్రిబ్యూటర్ గా మారిన నాగార్జున

నాగార్జునకు సినిమా పంపిణీ కొత్తకాదు. గతంలో అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ పై తెరకెక్కిన చాలా సినిమాల్ని నాగార్జున కొన్ని ఏరియాల్లో స్వయంగా పంపిణీ చేశారు. వేరే నిర్మాతలతో తను హీరోగా చేసిన కొన్నిసినిమాలకు కూడా నాగార్జున కొన్ని ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్ అవతారం ఎత్తారు. అయితే ఈసారి మాత్రం నాగార్జున మరో పెద్ద స్టెప్ వేశాడు. ఏకంగా బాహుబలి-2 పంపిణీ హక్కుల్ని దక్కించుకున్నాడు. తాజా సమాచారం ప్రకారం… నిర్మాత సాయి కొర్రపాటితో కలిసి 8కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి… కృష్ణా […]

డిస్ట్రిబ్యూటర్ గా మారిన నాగార్జున
X

నాగార్జునకు సినిమా పంపిణీ కొత్తకాదు. గతంలో అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ పై తెరకెక్కిన చాలా సినిమాల్ని నాగార్జున కొన్ని ఏరియాల్లో స్వయంగా పంపిణీ చేశారు. వేరే నిర్మాతలతో తను హీరోగా చేసిన కొన్నిసినిమాలకు కూడా నాగార్జున కొన్ని ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్ అవతారం ఎత్తారు. అయితే ఈసారి మాత్రం నాగార్జున మరో పెద్ద స్టెప్ వేశాడు. ఏకంగా బాహుబలి-2 పంపిణీ హక్కుల్ని దక్కించుకున్నాడు. తాజా సమాచారం ప్రకారం… నిర్మాత సాయి కొర్రపాటితో కలిసి 8కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి… కృష్ణా జిల్లా పంపిణీ హక్కుల్ని నాగార్జున దక్కించుకున్నట్టు తెలుస్తోంది.

నిజానికి నాగార్జునకు, బాహుబలి ప్రాజెక్టుకు సంబంధం లేదు. కానీ ఆ సినిమా పార్ట్-1 సృష్టించిన సంచలనం అందరికీ తెలిసిందే కదా. ఈ సినిమాను పంపిణీ చేసిన డిస్ట్రిబ్యూటర్లు అంతా 2వందల శాతం ప్రాఫిట్స్ అందుకున్నారు. పైగా పార్ట్-2పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. అందుకే నాగ్ కన్ను బాహుబలిపై పడింది. వెంటనే బాహుబలి-2 రైట్స్ దక్కించుకున్నాడు. అదీ సంగతి.

First Published:  8 Sep 2016 9:37 PM GMT
Next Story