Telugu Global
Cinema & Entertainment

నాని కొత్త సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని అప్పుడే మరో సినిమాను విడుదలకు సిద్ధం చేశాడు. చాలా తొందరగా సినిమాలు చేస్తూ, అంతే వేగంగా హిట్స్ కూడా కొడుతున్న ఈ హీరో ఇప్పుడు మజ్నుగా మన ముందుకు రాబోతున్నాడు. ఈనెల 23న ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వస్తుండడంతో మజ్ను ప్రాజెక్టుపై నాని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. భలే భలే మగాడివోయ్, కృష్ణగాడి వీరప్రేమగాథ, జెంటిల్ మన్… […]

నాని కొత్త సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్
X

వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని అప్పుడే మరో సినిమాను విడుదలకు సిద్ధం చేశాడు. చాలా తొందరగా సినిమాలు చేస్తూ, అంతే వేగంగా హిట్స్ కూడా కొడుతున్న ఈ హీరో ఇప్పుడు మజ్నుగా మన ముందుకు రాబోతున్నాడు. ఈనెల 23న ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వస్తుండడంతో మజ్ను ప్రాజెక్టుపై నాని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.

భలే భలే మగాడివోయ్, కృష్ణగాడి వీరప్రేమగాథ, జెంటిల్ మన్… ఇలా వరుసగా 3 విజయాలతో హ్యాట్రిక్ అందుకున్నాడు నాని. ఈ 3 విజయాలతో నాని మార్కెట్ అమాంతం పెరిగింది. అతడి సినిమాల్ని ఫ్యాన్సీ రేటుకు దక్కించుకునేందుకు బయ్యర్లు ఎగబడుతున్నారు. మరీ ముఖ్యంగా ఈ హ్యాట్రిక్ తో నాని ఓవర్సీస్ లో కూడా తన మార్కెట్ బేస్ పెంచుకున్నాడు. తాజాగా విడుదలకానున్న మజ్ను సినిమాకు కూడా ప్రీ-రిలీజ్ బిజినెస్ బ్రహ్మాండగా జరిగిందని చెబుతున్నారు. ఉయ్యాల జంపాల సినిమాతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్న విరించి వర్మ.. తన రెండో ప్రయత్నంగా ఈ మజ్నును తెరకెక్కించారు. త్వరలోనే విడుదల తేదీపై అధికారిక ప్రకటన రానుంది.

First Published:  7 Sep 2016 9:41 PM GMT
Next Story