Telugu Global
Cinema & Entertainment

లారెన్స్ వాళ్ల కోసం అన్ని వదులుకోంటున్నాడు..!

కొరియో గ్రాఫ‌ర్ లారెన్స్ కు కాస్త  జాలి ఎక్కువ‌.    ఇండ‌స్ట్రీలో  ఎన్నో  హ‌ర్డిల్స్ ఫేస్ చేసి  కొరియో గ్ర‌ఫ‌ర్ నుంచి ద‌ర్శ‌కుడిగా మారి స్టైల్..   మునీ సీక్వెల్స్ తో ఆల్ రౌండ‌ర్ అనిపించుకుంటున్న ప్ర‌తిభా వంతుడు.  ఇక అస‌లు విష‌యం ఏమిటంటే..   త‌మిళ్ హీరో విజ‌య్   కోసం  లారెన్స్  మ‌రోసారి త‌న పెద్ద మ‌న‌సు చాటుకున్నాడ‌ట‌. ‘తెరి’ సినిమా తర్వాత విజయ్‌ నటిస్తున్న 60వ చిత్రం ఫస్ట్‌లుక్‌, శీర్షిక కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు […]

లారెన్స్ వాళ్ల కోసం అన్ని వదులుకోంటున్నాడు..!
X

కొరియో గ్రాఫ‌ర్ లారెన్స్ కు కాస్త జాలి ఎక్కువ‌. ఇండ‌స్ట్రీలో ఎన్నో హ‌ర్డిల్స్ ఫేస్ చేసి కొరియో గ్ర‌ఫ‌ర్ నుంచి ద‌ర్శ‌కుడిగా మారి స్టైల్.. మునీ సీక్వెల్స్ తో ఆల్ రౌండ‌ర్ అనిపించుకుంటున్న ప్ర‌తిభా వంతుడు. ఇక అస‌లు విష‌యం ఏమిటంటే.. త‌మిళ్ హీరో విజ‌య్ కోసం లారెన్స్ మ‌రోసారి త‌న పెద్ద మ‌న‌సు చాటుకున్నాడ‌ట‌.

‘తెరి’ సినిమా తర్వాత విజయ్‌ నటిస్తున్న 60వ చిత్రం ఫస్ట్‌లుక్‌, శీర్షిక కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఈ చిత్రానికి ‘భైరవ’ అని టైటిల్‌ పెట్టారు. కోటు సూటు వేసుకుని ఓ రిక్షాలో వస్తున్నట్లు ఉన్న ఈ స్టిల్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. ఒకేరకమైన రెండు స్టిల్స్‌ను విడుదల చేశారు. విజయా ప్రొడక్షన్స్‌ బ్యానరుపై భారతిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2017 సంక్రాంతి కానుకగా ఈ సినిమాను తెరపైకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉండగా నిజానికి దర్శక నటుడు రాఘవ లారెన్స్‌ తాను నటించనున్న ఓ సినిమా కోసం ‘కాల భైరవ’ అనే పేరు నమోదు చేసుకున్నారట. అయితే విజయ్‌ కోసం ‘భైరవ’ అనే టైటిల్‌ వదులుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు గతంలో అజిత్‌ కోసం ‘వేదాలం’ అనే టైటిల్‌ను కూడా వదులుకున్న గొప్ప మనసు లారెన్స్‌ది.

First Published:  7 Sep 2016 4:03 AM GMT
Next Story