Telugu Global
Cinema & Entertainment

ఎక్స్ పోజింగ్ కు ఓకే... షరతులు వర్తిస్తాయి

నిత్యామీనన్ యాక్టంగ్ కు పెట్టింది పేరు. మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. కానీ గ్లామరస్ హీరోయిన్ గా మాత్రం ఆమెకు మార్కులు రాలేదు. సన్నాఫ్ సత్యమూర్తి సినిమా చేసినా, జనతా గ్యారేజ్ లో నటించినా హీరోయిన్ గా క్రెడిట్ సమంతాకే వెళ్లిపోయింది తప్ప.. తనకు లాభం చేకూరలేదనే విషయం నిత్యామీనన్ గ్రహించింది. దీంతో ఇన్నాళ్లూ విధించిన కండిషన్స్ ను కొంచెం కొంచెంగా పక్కనపెడుతోంది ఈ బ్యూటీ. తాజాగా ఇచ్చిన స్టేట్ మెంట్ దీనికి ఉదాహరణ. ఎక్స్ పోజింగ్ […]

ఎక్స్ పోజింగ్ కు ఓకే... షరతులు వర్తిస్తాయి
X

నిత్యామీనన్ యాక్టంగ్ కు పెట్టింది పేరు. మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. కానీ గ్లామరస్ హీరోయిన్ గా మాత్రం ఆమెకు మార్కులు రాలేదు. సన్నాఫ్ సత్యమూర్తి సినిమా చేసినా, జనతా గ్యారేజ్ లో నటించినా హీరోయిన్ గా క్రెడిట్ సమంతాకే వెళ్లిపోయింది తప్ప.. తనకు లాభం చేకూరలేదనే విషయం నిత్యామీనన్ గ్రహించింది. దీంతో ఇన్నాళ్లూ విధించిన కండిషన్స్ ను కొంచెం కొంచెంగా పక్కనపెడుతోంది ఈ బ్యూటీ. తాజాగా ఇచ్చిన స్టేట్ మెంట్ దీనికి ఉదాహరణ. ఎక్స్ పోజింగ్ చేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పిన నిత్యామీనన్.. సీన్ డిమాండ్ చేస్తే ఆమాత్రం చూపించడానికి ప్రాబ్లమ్ లేదని తేల్చిచెప్పింది. కథల ఎఁపికలో కూడా రూటు మార్చాలనుకుంటోంది ఈ మలయాళీ కుట్టి. ఇన్నాళ్లూ తనకు నచ్చిన కథల కోసం వెయిట్ చేసేది. ఇకపై మాత్రం తన దగ్గరకు వచ్చిన కథల్లో ఒకట్రెండ్ సెలక్ట్ చేసుకుంటానని చెబుతోంది. నిత్యామీనన్ ఎందుకు ఇంత సెడన్ గా మారిపోయిందే విషయంపై మాత్రం ఎవరూ విశ్లేషణ చేయలేకపోతున్నారు. తెలుగులో మరిన్ని అవకాశాల్ని పెంచుకునేందుకే నిత్యామీనన్ ఇలాంటి నిర్ణయం తీసుకుందని, మలయాళ సినిమాల కోసమైతే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదని అంటున్నారు చాలామంది. అది నిజమే అయినప్పటికీ.. ఇంత సడెన్ గా నిత్యామీనన్ ఇలా బోల్డ్ డెసిషన్ తీసుకోవడం మాత్రం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

First Published:  6 Sep 2016 10:50 PM GMT
Next Story