Telugu Global
Cinema & Entertainment

అక్టోబర్ నుంచి బన్నీ సినిమా

నిజానికి మరో వారం రోజుల్లో బన్నీ సినిమా మొదలవుతుందని అంతా ఎక్స్ పెక్ట్ చేశారు. కానీ బ్రేకింగ్ న్యూస్, బన్నీ అభిమానులకు షాకింగ్ న్యూస్. అక్టోబర్ రెండో వారం వరకు కొత్త సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చేది లేదని బన్నీ ప్రకటించాడు. సరైనోడు సక్సెస్ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్, మరో నెల రోజులు గ్యాప్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు.ఈ సినిమాకు సంబంధించి హరీష్ శంకర్ ఇప్పటికే కథ, స్క్రీన్ ప్లే మొత్తం పూర్తిచేశాడు. అటు […]

అక్టోబర్ నుంచి బన్నీ సినిమా
X

నిజానికి మరో వారం రోజుల్లో బన్నీ సినిమా మొదలవుతుందని అంతా ఎక్స్ పెక్ట్ చేశారు. కానీ బ్రేకింగ్ న్యూస్, బన్నీ అభిమానులకు షాకింగ్ న్యూస్. అక్టోబర్ రెండో వారం వరకు కొత్త సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చేది లేదని బన్నీ ప్రకటించాడు. సరైనోడు సక్సెస్ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్, మరో నెల రోజులు గ్యాప్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు.ఈ సినిమాకు సంబంధించి హరీష్ శంకర్ ఇప్పటికే కథ, స్క్రీన్ ప్లే మొత్తం పూర్తిచేశాడు. అటు నిర్మాత దిల్ రాజు కూడా సిద్ధంగా ఉన్నాడు. కానీ సినిమాలో ఓ కొత్త లుక్ చూపించేందుకే బన్నీ ఇలా మరో నెల రోజులు టైం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. తాజా సమాచారం ప్రకారం పూజా హెగ్డే పేరు ప్రధానంగా వినిపిస్తోంది. స్టార్ హీరోయిన్లు శృతిహాసన్, రకుల్ ప్రీత్ సింగ్ బిజీగా ఉండడం.. సమంత సినిమాలు తగ్గించేయడంతో… పూజా హెగ్డే పేరును దాదాపు ఫైనల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సినిమా సెట్స్ పైకి వచ్చిన వెంటనే హీరోయిన్ పేరును ప్రకటిస్తారు. ఈ సినిమాకు డీజే అనే పేరును పక్కా చేసిన సంగతి తెలిసిందే. డీజే అంటే దువ్వాడ జగన్నాధమ్. మూవీకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించబోతున్నాడు.

First Published:  6 Sep 2016 10:48 PM GMT
Next Story