Telugu Global
Cinema & Entertainment

దసరా బరిలో మరో సినిమా...

దసరాకు ఒక్కొక్కటిగా సినిమాలు పక్కా అవుతున్నాయి. ఇప్పటికే రామ్ తన హైపర్ మూవీని దసరా బరిలో నిలిపాడు. సినిమా షూటింగ్ ను దాదాపు పూర్తిచేసిన ఈ కుర్రహీరో, హైపర్ ను సెప్టెంబర్ 30న విడుదల చేస్తున్నట్టు పదేపదే ప్రకటనలు గుప్పిస్తున్నాడు. అటు ధృవ యూనిట్ కూడా తమ సినిమాను దసరాకే విడుదల చేస్తామని గతంలో ప్రకటించింది. కానీ తాజా సమాచారం ప్రకారం… చెర్రీ నటిస్తున్న ధృవ సినిమా వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ సినిమా షూటింగ్ […]

దసరా బరిలో మరో సినిమా...
X

దసరాకు ఒక్కొక్కటిగా సినిమాలు పక్కా అవుతున్నాయి. ఇప్పటికే రామ్ తన హైపర్ మూవీని దసరా బరిలో నిలిపాడు. సినిమా షూటింగ్ ను దాదాపు పూర్తిచేసిన ఈ కుర్రహీరో, హైపర్ ను సెప్టెంబర్ 30న విడుదల చేస్తున్నట్టు పదేపదే ప్రకటనలు గుప్పిస్తున్నాడు. అటు ధృవ యూనిట్ కూడా తమ సినిమాను దసరాకే విడుదల చేస్తామని గతంలో ప్రకటించింది. కానీ తాజా సమాచారం ప్రకారం… చెర్రీ నటిస్తున్న ధృవ సినిమా వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ సినిమా షూటింగ్ నెల రోజుల్లో కంప్లీట్ కాదు కాబట్టి… దసరా బరి నుంచి తప్పుకోవడమే బెటర్ అని ఆలోచిస్తున్నారు. ఇప్పుడా ప్లేస్ ను నాగచైతన్య భర్తీ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఒకేసారి రెండు సినిమాల్ని కంప్లీట్ చేసిన చైతూ… ఈ దసరాకు ప్రేమమ్ సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నాడు. వచ్చేనెల 5 లేదా 7వ తేదీన ప్రేమమ్ ను థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ఈనెల 20న ప్రేమమ్ ఆడియోను విడుదల చేస్తారు. అప్పుడే సినిమా విడుదల తేదీని కూడా ప్రకటిస్తారు. శృతిహాసన్, మడొన్నా సెబాస్టియన్, అనుపమ పరమేశ్వరన్ ఇందులో హీరోయిన్లుగా నటించారు. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాగార్జున, వెంకటేష్ గెస్ట్ రోల్స్ చేయడం విశేషం.

Click to Read

అపరిచితుడికి ఇ‍ంకొకడి ద్వారా హిట్ కొడతాడా ? అపరిచితుడికి ఇ‍ంకొకడి ద్వారా హిట్ కొడతాడా ?
First Published:  5 Sep 2016 10:08 PM GMT
Next Story