Telugu Global
Cinema & Entertainment

బాహుబలి లొకేషన్ లో రామ్ షూటింగ్

బాహుబలి సినిమా రాజుల కాలం నాటి కథతో తెరకెక్కుతోంది. ఇక రామ్ తీస్తున్న హైపర్ సినిమా పక్కా మాస్ మసాలా ముూవీ. మరి ఈ రెండింటికి ఎలా సింక్ అయింది అనుకుంటున్నారా.. నిజంగానే సింక్ అయిందండీ బాబు. బాహుబలి తీసిన లొకేషన్ లోనే రామ్ ఆడిపాడబోతున్నాడు. ఇందులో జార్జియా దేశం వేదికగా మారింది. బాహుబలిలో కొన్ని కీలకమైన సన్నివేశాల్ని జార్జియాలో తెరకెక్కించిన విషయం తెలిసిందే. తమన్నతో కలిసున్న కొన్ని సన్నివేశాలు మనకు జార్జియా బ్యాక్ డ్రాప్ లో […]

బాహుబలి లొకేషన్ లో రామ్ షూటింగ్
X

బాహుబలి సినిమా రాజుల కాలం నాటి కథతో తెరకెక్కుతోంది. ఇక రామ్ తీస్తున్న హైపర్ సినిమా పక్కా మాస్ మసాలా ముూవీ. మరి ఈ రెండింటికి ఎలా సింక్ అయింది అనుకుంటున్నారా.. నిజంగానే సింక్ అయిందండీ బాబు. బాహుబలి తీసిన లొకేషన్ లోనే రామ్ ఆడిపాడబోతున్నాడు. ఇందులో జార్జియా దేశం వేదికగా మారింది.

బాహుబలిలో కొన్ని కీలకమైన సన్నివేశాల్ని జార్జియాలో తెరకెక్కించిన విషయం తెలిసిందే. తమన్నతో కలిసున్న కొన్ని సన్నివేశాలు మనకు జార్జియా బ్యాక్ డ్రాప్ లో కనిపిస్తాయి. ఇప్పుడు యాజ్ ఇటీజ్ అవే లొకేషన్లలో రామ్ కూడా షూటింగ్ చేయబోతున్నాడు. తన కొత్త సినిమా హైపర్ కు సంబంధించి జార్జియాలోని లొకేషన్లలో ఓ పాటను పిక్చరైజ్ చేయబోతున్నాడు. రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు కందిరీగ ఫేం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. మరికొన్ని రోజుల్లో ఆడియోను విడుదల చేసి, ఈనెలాఖరుకు సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని అనుకుంటున్నారు.

First Published:  5 Sep 2016 2:46 AM GMT
Next Story