Telugu Global
Cinema & Entertainment

టీజ‌రే హైప‌ర్‌!

తండ్రిని అతిగా ప్రేమించే కొడుకు అన్న లైన్‌తో రూపుదిద్దుకున్న చిత్రం హైప‌ర్‌. తాజాగా ఈ చిత్ర టీజ‌ర్ శనివారం విడుద‌లైంది. ఈ టీజ‌ర్‌కు ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న క‌నిపిస్తోంది. కింద‌ప‌డిపోతే.. అంతా అమ్మా! అని ఎందుకంటారు?  నాన్న .. అని ఎందుకు అన‌రు? అంటూ చిన్నారి రామ్ అడిగే ప్ర‌శ్న‌తోనే చిత్రంలో హీరోకు తండ్రిప‌ట్ల ఏ రేంజ్లో ప్రేమ ఉందో చెప్ప‌క‌నే చెప్పాడు ద‌ర్శ‌కుడు. మొత్తానికి నేను శైల‌జ చిత్రంతో చాలాకాలం త‌రువాత హిట్ అందుకున్న […]

టీజ‌రే హైప‌ర్‌!
X
తండ్రిని అతిగా ప్రేమించే కొడుకు అన్న లైన్‌తో రూపుదిద్దుకున్న చిత్రం హైప‌ర్‌. తాజాగా ఈ చిత్ర టీజ‌ర్ శనివారం విడుద‌లైంది. ఈ టీజ‌ర్‌కు ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న క‌నిపిస్తోంది. కింద‌ప‌డిపోతే.. అంతా అమ్మా! అని ఎందుకంటారు? నాన్న .. అని ఎందుకు అన‌రు? అంటూ చిన్నారి రామ్ అడిగే ప్ర‌శ్న‌తోనే చిత్రంలో హీరోకు తండ్రిప‌ట్ల ఏ రేంజ్లో ప్రేమ ఉందో చెప్ప‌క‌నే చెప్పాడు ద‌ర్శ‌కుడు. మొత్తానికి నేను శైల‌జ చిత్రంతో చాలాకాలం త‌రువాత హిట్ అందుకున్న రామ్ ఇప్పుడు హైప‌ర్‌తో మ‌రో విజ‌యంపై క‌న్నేశాడు. ఈ చిత్రంలో రామ్ తండ్రిగా స‌త్య‌రాజ్ న‌టించ‌డం సినిమాకు అద‌న‌పు ఆక‌ర్ష‌ణ అని చెప్ప‌వ‌చ్చు. రామ్ గ‌త చిత్రం నేను శైల‌జ‌లో హీరోయిన్ తండ్రిగా క‌నిపించిన స‌త్య‌రాజ్ ఈ చిత్రంలో హీరో రామ్‌కు తండ్రిగానూ మెప్పించాడని తెలుస్తోంది. మొత్తానికి రామ్‌తో కందిరీగ లాంటి హైప‌ర్ ఎన‌ర్జిటిక్ సినిమాను తీసిన ద‌ర్శ‌కుడు సంతోష్ శ్రీ‌నివాస్ మ‌రోసారి అలాంటి క‌థ‌తోనే ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. ఎప్ప‌ట్లాగే రామ్ త‌న స‌హ‌జ‌మైన ఎన‌ర్జిట‌క్ ఫ‌ర్మామెన్స్‌తో వ‌స్తున్నాడు.

Also Read
First Published:  3 Sep 2016 8:08 PM GMT
Next Story