Telugu Global
Cinema & Entertainment

3 రోజులకే మిలియన్ డాలర్లు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సంచలనం సృష్టించాడు. జనతా గ్యారేజ్ సినిమాతో 3 రోజులకే మిలియన్ మార్క్ అందుకున్నాడు. ఓవర్సీస్ లో ఈ రికార్డు సృష్టించిన తారక్, ఇకపై ఆ సెగ్మెంట్ లో కూడా తనకు ఎదురులేదని నిరూపించుకున్నాడు. రేసులోకి వచ్చానంటూ తోటి హీరోలకు సంకేతాలు పంపించాడు. జనతా గ్యారేజ్ సినిమా ఓవర్సీస్ లో విడుదలైన మొదటి రోజే ప్రీమియర్స్ తో కలుపుకొని దాదాప 5 లక్షల 70వేల డాలర్లు ఆర్జించింది. ఆ పాజిటివ్ టాక్ రెండు, మూడో […]

3 రోజులకే మిలియన్ డాలర్లు
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సంచలనం సృష్టించాడు. జనతా గ్యారేజ్ సినిమాతో 3 రోజులకే మిలియన్ మార్క్ అందుకున్నాడు. ఓవర్సీస్ లో ఈ రికార్డు సృష్టించిన తారక్, ఇకపై ఆ సెగ్మెంట్ లో కూడా తనకు ఎదురులేదని నిరూపించుకున్నాడు. రేసులోకి వచ్చానంటూ తోటి హీరోలకు సంకేతాలు పంపించాడు. జనతా గ్యారేజ్ సినిమా ఓవర్సీస్ లో విడుదలైన మొదటి రోజే ప్రీమియర్స్ తో కలుపుకొని దాదాప 5 లక్షల 70వేల డాలర్లు ఆర్జించింది. ఆ పాజిటివ్ టాక్ రెండు, మూడో రోజు కూడా కొనసాగడంతో… విడుదలైన 3 రోజులకే మిలియన్ మార్క్ అందుకున్న సినిమాగా జనతా గ్యారేజ్ నిలిచింది. 3 రోజుల్లో ఈ సినిమాకు 10లక్షల డాలర్లకు పైగా వసూళ్లు వచ్చాయి.

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన జనతా గ్యారేజ్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి టాక్ తో దూసుకుపోతోంది. విడుదలైన ప్రారంభంలో సినిమా సీరియస్ గా ఉందనే నెగెటివ్ ఫీడ్ బ్యాక్ అందుకున్నప్పటికీ…. ఆ ప్రభావం వసూళ్లపై మాత్రం కనిపించలేదు. మరీ ముఖ్యంగా లాంగ్ వీకెండ్ కావడంతో సినిమాపై మిక్స్ డ్ ట్యాక్ ఉన్నప్పటికీ ప్రేక్షకులు మాత్రం థియేటర్ల ముందు క్యూ కట్టారు. అలా జనతా గ్యారేజ్ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లోనే బెస్ట్ ఫిగర్స్ నమోదు చేస్తోంది.

Also Read
Hyper Movie Teaser

First Published:  3 Sept 2016 9:41 PM GMT
Next Story