Telugu Global
Cinema & Entertainment

ఈ నెలలోనే సినిమా అంటున్న చైతూ...

మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ ప్రేమమ్ ను దసరా కానుకగా విడుదల చేస్తామని నాగచైతన్య ప్రకటించిన కొన్ని రోజులకే…. అటు దర్శక-నిర్మాత గౌతమ్ మీనన్ కూడా సాహసం శ్వాసగా సాగిపో సినిమాను అదే రోజు విడుదల చేస్తామని ప్రకటించి సంచలనం సృష్టించాడు. వెంటనే రంగంలోకి దిగిన నాగచైతన్య… 2 సినిమాలు ఒకేరోజు విడుదలకాకుండా ఆపగలిగాడు. అలా తన సినిమాకు తానే పోటీలేకుండా నిలిచాడు. దీంతో ప్రేమమ్ సినిమా దసరా కానుకగా… ఆ తర్వాత దసరా ఎండింగ్ లోనే సాహసం […]

ఈ నెలలోనే సినిమా అంటున్న చైతూ...
X

మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ ప్రేమమ్ ను దసరా కానుకగా విడుదల చేస్తామని నాగచైతన్య ప్రకటించిన కొన్ని రోజులకే…. అటు దర్శక-నిర్మాత గౌతమ్ మీనన్ కూడా సాహసం శ్వాసగా సాగిపో సినిమాను అదే రోజు విడుదల చేస్తామని ప్రకటించి సంచలనం సృష్టించాడు. వెంటనే రంగంలోకి దిగిన నాగచైతన్య… 2 సినిమాలు ఒకేరోజు విడుదలకాకుండా ఆపగలిగాడు. అలా తన సినిమాకు తానే పోటీలేకుండా నిలిచాడు. దీంతో ప్రేమమ్ సినిమా దసరా కానుకగా… ఆ తర్వాత దసరా ఎండింగ్ లోనే సాహసం శ్వాసగా సాగిపో సినిమాలు వస్తాయనే ప్రచారం సాగింది. అయితే తాజా సమాచారం ప్రకారం… ప్రేమమ్ కంటే ముందే తన సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని అనుకుంటున్నాడు దర్శకనిర్మాత గౌతమ్ మీనన్. చాన్నాళ్లుగా వాయిదాపడుతూ వస్తున్న సాహసం శ్వాసగా సాగిపో సినిమాను ఈ నెలలోనే థియేటర్లలోకి తీసుకొస్తున్నట్టు అధికారికంగా ప్రకటించాడు. ఈ మేరకు ట్విట్టర్ లో ఓ వీడియో విడుదల చేసి మరీ న్యూస్ పక్కా చేశాడు. అంటే ప్రేమమ్ కంటే ముందే సాహసం శ్వాసగా సాగిపో థియేటర్లలోకి వస్తోందన్నమాట. రెహ్మాన్ సంగీతం అందించిన ఈ సినిమాలో చైతూ సరసన మంజిమా మోహన్ హీరోయిన్ గా నటించింది.

Click to read

తెలుగువారి కోసం ఇళయరాజా కార్యక్రమం తెలుగువారి కోసం ఇళయరాజా కార్యక్రమం

First Published:  1 Sep 2016 11:49 PM GMT
Next Story