Telugu Global
Cinema & Entertainment

రిపేర్ కు నోచుకోని నిత్య, సమంత‌

స‌మంత ప్ర‌స్తుతం టాప్ హీరోయిన్స్ లో ఒక‌రు. ఇప్ప‌టికే ఈ యేడాది త‌ను న‌టించిన  చిత్రాలు రిలీజ్ అయ్యాయి. ప్రస్తుత్తం స్టార్ హీరోలంద‌రి బెస్ట్ చాయ‌స్ సమంతా అంటే అతి శ‌యోక్తి కాదు. సమంతా హీరోయిన్ గా న‌టిస్తే ఆన్ స్క్రీన్ బావుంటుంద‌నే ఫిలీంగ్ అంద‌రి హీరోల‌ది. క‌ట్ చే్స్తే గురువారం రిలీజ్ అయిన జ‌న‌తా గ్యారేజ్ చిత్రంలో స‌మంత , నిత్యామీన‌న్ లు న‌టించారు. కానీ .. క‌థ ప‌రంగా ఈ ఇద్ద‌రి హీరోయిన్స్ కు పెద్ద ప్రాధాన్య‌త […]

రిపేర్ కు నోచుకోని నిత్య, సమంత‌
X

స‌మంత ప్ర‌స్తుతం టాప్ హీరోయిన్స్ లో ఒక‌రు. ఇప్ప‌టికే ఈ యేడాది త‌ను న‌టించిన చిత్రాలు రిలీజ్ అయ్యాయి. ప్రస్తుత్తం స్టార్ హీరోలంద‌రి బెస్ట్ చాయ‌స్ సమంతా అంటే అతి శ‌యోక్తి కాదు. సమంతా హీరోయిన్ గా న‌టిస్తే ఆన్ స్క్రీన్ బావుంటుంద‌నే ఫిలీంగ్ అంద‌రి హీరోల‌ది. క‌ట్ చే్స్తే గురువారం రిలీజ్ అయిన జ‌న‌తా గ్యారేజ్ చిత్రంలో స‌మంత , నిత్యామీన‌న్ లు న‌టించారు. కానీ .. క‌థ ప‌రంగా ఈ ఇద్ద‌రి హీరోయిన్స్ కు పెద్ద ప్రాధాన్య‌త లేదు. యాక్టింగ్ ప‌రంగా గానీ.. గ్లామ‌ర్ ప‌రంగా గానీ ఏమి స్కోప్ లేదు. క‌నీసం స‌మంత‌, ఎన్టీఆర్ ల మ‌ధ్య ల‌వ్ ట్రాక్ ను ఇంకాస్త బాగా డిజైన్ చేసుకుని వుంటే బావుండేద‌ని ఆమే ఫ్యాన్స్ అభిప్రాయ ప‌డుతున్నారు. కానీ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ మాత్రం ఎందుకో ఈ సారి హీరోయిన్స్ కంటే.. హీరోల మీద‌నే బాగా ఫోక‌స్ పెట్టాడు.

ఇదిలా వుంటే.. మ‌ల‌యాళ న‌టుడు మోహ‌న్ లాల్ సినిమాకు ప్రాణం పోశాడు. సినిమాకు ప్రాణం మోహ‌న్ లాల్ రోలే. యాక్టింగ్ ప‌రంగా ఎన్టీఆర్ మ‌రోసారి త‌న ప్ర‌తిభ‌ను ఘ‌నంగా చాటుకున్నాడు. సెకండాఫ్ లో వ‌చ్చే ఎమోష‌న‌ల్ సీన్స్ లో ఎన్టీఆర్ చెల‌రేగాడు. ఓవ‌రాల్ గా ఎన్టీఆర్ నటన అభిమానుల మ‌న‌సు దోచింది అనేది ప‌రిశీల‌కులు ముగింపు. అయితే ఎన్టీఆర్ అంటే తొడ కొట్టాలి.. వంశాల గురించి డైలాగ్ లు అద‌ర గొట్టాలి అలా చేస్తేనే ఎన్టీఆర్ సినిమా అని భావించే వారు జ‌న‌తా గ్యారేజ్ చూడ‌న‌వ‌స‌రం లేదు. ఎందుకంటే అటువంటి వారికి నిరాశే మ‌రి.

Click to read

తెలుగువారి కోసం ఇళయరాజా కార్యక్రమం తెలుగువారి కోసం ఇళయరాజా కార్యక్రమం

First Published:  1 Sep 2016 11:51 PM GMT
Next Story