Telugu Global
Cinema & Entertainment

గౌతమీపుత్ర శాతకర్ణి లీక్ అయింది...

బాలయ్య తన వందో సినిమాగా గౌతమీపుత్ర శాతకర్ణిని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మధ్యప్రదేశ్ లోని కొన్ని ఆధ్యాత్మిక, చారిత్రక ప్రదేశాల్లో శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉండగా, సినిమాకు సంబంధించిన కొన్ని స్టిల్స్ ను ఎవరో ఫొటోలు తీసి నెట్ లో పెట్టారు. దీంతో యూనిట్ అవాక్కయింది. గోప్యంగా ఉంచాల్సిన చిత్రాల్ని ఇలా ముందుగానే పబ్లిక్ లో విడుదల చేయడంతో దర్శకుడు క్రిష్ కూడా కాస్త అసహనానికి గురయ్యాడు. అయితే తాజాగా లీక్ అయిన […]

గౌతమీపుత్ర శాతకర్ణి లీక్ అయింది...
X

బాలయ్య తన వందో సినిమాగా గౌతమీపుత్ర శాతకర్ణిని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మధ్యప్రదేశ్ లోని కొన్ని ఆధ్యాత్మిక, చారిత్రక ప్రదేశాల్లో శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉండగా, సినిమాకు సంబంధించిన కొన్ని స్టిల్స్ ను ఎవరో ఫొటోలు తీసి నెట్ లో పెట్టారు. దీంతో యూనిట్ అవాక్కయింది. గోప్యంగా ఉంచాల్సిన చిత్రాల్ని ఇలా ముందుగానే పబ్లిక్ లో విడుదల చేయడంతో దర్శకుడు క్రిష్ కూడా కాస్త అసహనానికి గురయ్యాడు. అయితే తాజాగా లీక్ అయిన పిక్ మాత్రం నెట్ లో వైరల్ అయింది. నిజానికి ఇందులో బాలయ్య బాబు లేడు. శ్రియ, హేమమాలిని మాత్రమే ఉన్నారు. రాజమాత పాత్రలో బాలయ్యకు తల్లిగా హేమమాలిని, బాలయ్యకు భార్యగా ఓ బాబుతో శ్రియ ఇందులో కనిపిస్తున్నారు. ఈ ఫొటో నెట్ లో పెట్టిన వెంటనే దానికి విశేష స్పందన వచ్చింది. ముఖ్యంగా అత్తాకోడళ్లు అయిన హేమమాలిని, శ్రియల లుక్స్ అదిరిపోయాయనే చెప్పుకోవాలి. తాజా ఫొటోలతో గౌతమీపుత్ర శాతకర్ణి ప్రాజెక్టుపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. అయితే ఈ ఫొటోల్ని యూనిట్ సభ్యులే కావాలని విడుదల చేశారా.. లేక ఎవరైనా లీక్ చేశారా అనే విషయం తేలాల్సి ఉంటుంది.

Click to read

తెలుగువారి కోసం ఇళయరాజా కార్యక్రమం తెలుగువారి కోసం ఇళయరాజా కార్యక్రమం

First Published:  1 Sep 2016 11:40 PM GMT
Next Story