ఇవే జనతా గ్యారేజ్ బలాలు..!
కొరటాల శివ… ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ చిత్రం టాక్ వచ్చేసింది. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే కొరటాల శివ రాసుకున్న రెండు బలమైన పాత్రలు, వాటి చుట్టూ ఉన్న ఎమోషన్ అని చెప్పుకోవాలి. ముఖ్యంగా మనుషులు బాగుండాలని కోరుకునే సత్యం పాత్రలో బలమైన ఎమోషన్ ఉంది. జనతా గ్యారెజ్ అన్న ఒక పేరుని ఎంతో మందికి శక్తిగా మార్చి, సత్యం, ఓ ప్యారలల్ సొసైటీ నడపడం అన్నదానిలో అదిరిపోయే హీరోయిజం ఉంది. […]
BY admin31 Aug 2016 10:47 PM GMT
X
admin Updated On: 31 Aug 2016 10:52 PM GMT
కొరటాల శివ… ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ చిత్రం టాక్ వచ్చేసింది. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే కొరటాల శివ రాసుకున్న రెండు బలమైన పాత్రలు, వాటి చుట్టూ ఉన్న ఎమోషన్ అని చెప్పుకోవాలి. ముఖ్యంగా మనుషులు బాగుండాలని కోరుకునే సత్యం పాత్రలో బలమైన ఎమోషన్ ఉంది. జనతా గ్యారెజ్ అన్న ఒక పేరుని ఎంతో మందికి శక్తిగా మార్చి, సత్యం, ఓ ప్యారలల్ సొసైటీ నడపడం అన్నదానిలో అదిరిపోయే హీరోయిజం ఉంది. దీన్ని కొన్నిచోట్ల బాగానే వాడుకున్నారని చెప్పొచ్చు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన నటనా స్థాయిని ఈ సినిమాతో మరోసారి బయటపెట్టాడు. డైలాగ్ డెలివరీలో, యాక్టింగ్‍లో మంచి నటన కనబరుస్తూ ఎన్టీఆర్ సినిమాకు ఓ స్థాయి తీసుకొచ్చాడు. ఇక కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్‌ను తెలుగు తెరపై చూడడమన్నది ఓ అద్భుతమైన అనుభూతి. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో మోహన్ లాల్ నటనకు ఎక్కడా వంక పెట్టలేం. చాలాచోట్ల సినిమాను ఆయన పాత్రే నిలబెట్టింది. సినిమా పరంగా చూసుకుంటే సెకండాఫ్‌లో మొదటి ఇరవై నిమిషాల సన్నివేశాలు మేజర్ హైలైట్‌గా చెప్పాలి. ‘జయహో జనతా..’ అంటూ ఈ సమయంలోనే వచ్చే మాంటేజ్ సాంగ్ చాలా బాగుంది. ఇక ‘పక్కాలోకల్’ అంటూ స్టార్ హీరోయిన్ కాజల్ చేసిన ఐటమ్ సాంగ్ మంచి రిలీఫ్!ఓవరాల్ గా సినిమా సూపర్ హిట్ జోన్ లో చేరే అవకాశం ఉంది అనేది పరిశీలకుల టాక్.
Click to Read
Next Story