Telugu Global
Cinema & Entertainment

చిన్న హీరోల్ని  టార్గెట్  చేసిన పూరి జ‌గ‌న్నాధ్..! 

పూరీ కి  ఫ‌లాన హీరో అనే టార్గెట్ ఏమి ఉండ‌దంటారు. అయితే స్టార్ డ‌మ్ వున్న వారితో చేస్తే   గుర్తింపు వేరు. కానీ…ద‌ర్శ‌కులు ఫెయిల్యూర్ లో వుంటే   స్టార్ హీరోలు సేఫ్ జోన్ ఎంచుకుంటారు.  పూరి అయినా..రాజ‌మౌళి అయినా స‌క్సెస్ లో వుంటేనే వాళ్ల‌కు డిమాండ్.  పోకిరి త‌రువాత  పూరి జ‌గ‌న్నాధ్  కు ఇండ‌స్ట్రీలో   గ్రాఫ్ పెరిగింది. ఆ చిత్రం ఇచ్చిన  క‌మ‌ర్షియ‌ల్  స‌క్సెస్ అసాధార‌ణం కావ‌డంతో ఒక్క‌సారిగా  పూరి స్టార్ ద‌ర్శ‌కుల్లో […]

చిన్న హీరోల్ని  టార్గెట్  చేసిన పూరి జ‌గ‌న్నాధ్..! 
X
పూరీ కి ఫ‌లాన హీరో అనే టార్గెట్ ఏమి ఉండ‌దంటారు. అయితే స్టార్ డ‌మ్ వున్న వారితో చేస్తే గుర్తింపు వేరు. కానీ…ద‌ర్శ‌కులు ఫెయిల్యూర్ లో వుంటే స్టార్ హీరోలు సేఫ్ జోన్ ఎంచుకుంటారు. పూరి అయినా..రాజ‌మౌళి అయినా స‌క్సెస్ లో వుంటేనే వాళ్ల‌కు డిమాండ్. పోకిరి త‌రువాత పూరి జ‌గ‌న్నాధ్ కు ఇండ‌స్ట్రీలో గ్రాఫ్ పెరిగింది. ఆ చిత్రం ఇచ్చిన క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ అసాధార‌ణం కావ‌డంతో ఒక్క‌సారిగా పూరి స్టార్ ద‌ర్శ‌కుల్లో అగ్ర‌గామి అనిపించుకునే స్థాయికి రీచ్ అయ్యాడు,
అయితే ఈ మ‌ధ్య త‌న స‌క్సెస్ ల రేషియో త‌గ్గింది. టెంప‌ర్ చిత్రం ప‌ర‌వాలేద‌నిపించుకుంది. ప్ర‌స్తుతం క‌ళ్యాణ్ రామ్ తో ఇజ‌మ్ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం పూర్తి కావోచ్చింది. దీంతో నాగశౌర్య తో త‌న త‌రువాత ప్రాజెక్ట్ చేయ‌బోతున్న‌ట్లు టాక్ వినిపిస్తుంది.పూరి జగన్నాధ్, ఆయన మిత్రులు కలిసి ఓ చిన్న సినిమా చేసే ప్రయత్నంలో వున్నారు. దీని కోసం హీరోగా నాగశౌర్యను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాను పూరి డైరెక్ట్ చేస్తారో, సూపర్ వైజ్ చేస్తారో ఇంకా డిసైడ్ కాలేదు. అలాగే పూరి ఈ ప్రాజెక్టును తన సన్నిహితులైన నిర్మాతల్లో ఒకరికి కేటాయిస్తారని కూడా టాక్ వుంది. క‌ళ్యాణ్ రామ్ తో చేస్తున్న ఇజ‌మ్ సూప‌ర్ హిట్ అయితే మహేష్ బాబు మ‌ళ్లీ అవ‌కాశం ఇచ్చే చాన్స్ ఉంద‌నే టాక్ వినిపిస్తుంది.
First Published:  31 Aug 2016 3:12 AM GMT
Next Story