Telugu Global
Cinema & Entertainment

మ‌హేష్ ను ఎన్టీఆర్ ఓవ‌ర్ టేక్ చేస్తాడా..?

ద‌ర్శ‌కుడు కొర‌టాల  శివ  పెద్దగా క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ ఏమి లేకుండానే సినిమాను  సూప‌ర్ హిట్ చేయ‌గ‌ల ద‌ర్శ‌కుడు అని నిరూపించుకున్నాడు.  మ‌హేష్ బాబు, శృతిహాస‌న్ లీడ్ రోల్స్ లో   కొర‌టాల త‌న రెండో చిత్రంగా చేసిన  శ్రీ‌మంతుడు  బాక్సాఫీస్ రికార్డ్స్  సృష్టించింది. మ‌హేష్ బాబు  కెరీర్ లో ది బెస్ట్ అనిపించుకుంది.   బాహుబ‌లి త‌రువాత తెలుగులో  సెకండ్ హైయ‌స్ట్ బాక్సాఫీస్  బ్లాక్ బ‌స్ట‌ర్ లిస్ట్ లో నిలిచింది. క‌ట్ చేస్తే తాజాగా   ఎన్టీఆర్  సినిమా పై బాక్సాఫీస్ […]

మ‌హేష్ ను ఎన్టీఆర్ ఓవ‌ర్ టేక్ చేస్తాడా..?
X

ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ పెద్దగా క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ ఏమి లేకుండానే సినిమాను సూప‌ర్ హిట్ చేయ‌గ‌ల ద‌ర్శ‌కుడు అని నిరూపించుకున్నాడు. మ‌హేష్ బాబు, శృతిహాస‌న్ లీడ్ రోల్స్ లో కొర‌టాల త‌న రెండో చిత్రంగా చేసిన శ్రీ‌మంతుడు బాక్సాఫీస్ రికార్డ్స్ సృష్టించింది. మ‌హేష్ బాబు కెరీర్ లో ది బెస్ట్ అనిపించుకుంది. బాహుబ‌లి త‌రువాత తెలుగులో సెకండ్ హైయ‌స్ట్ బాక్సాఫీస్ బ్లాక్ బ‌స్ట‌ర్ లిస్ట్ లో నిలిచింది.

క‌ట్ చేస్తే తాజాగా ఎన్టీఆర్ సినిమా పై బాక్సాఫీస్ టాక్ అప్పుడే ప్రారంభం అయ్యింది. ఎన్టీఆర్ కూడా ఒక బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ( సింహాద్రి ని మించి) కొట్టాల‌ని ఎంతో కాలం నుంచి క‌సిగా వున్నాడు. అందుకే ఇండ‌స్ట్రీలో హిట్ ఇవ్వ‌గానే ..ఆ డైరెక్ట‌ర్స్ కు పిలిచి మ‌రి చాన్స్ ఇచ్చిన సంద‌ర్భాలున్నాయి. అయితే వారెవ‌రు ఎన్టీఆర్ డ్రీమ్ ను నిజం చేయ‌లేదు. త‌మ అభిమాన హీరో క‌నీసం 50 కోట్ల క్ల‌బ్ లో అయినా చేరాల‌ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంత‌గానో కోరుకుంటున్నారు. అల్రేడి కెరీర్ ప‌రంగా త‌న‌కంటే వెన‌క ప్రారంభించిన బ‌న్నీ.. రామ్ చ‌ర‌ణ్ లు ఎప్పుడో 50 కోట్ల క్ల‌బ్ లో చేరారు. త‌ను మాత్రం ఇప్ప‌టికీ ఆశిస్తున్న బ్లాక్ బ‌స్ట‌ర్ కోసం వెయిట్ చేస్తూనే వున్నాడు. మ‌రి మ‌హేష్ ను బాక్సాఫీస్ శ్రీ‌మంతుడు చేసిన కొర‌టాల శివ‌.. యంగ్ టైగ‌ర్ ను కూడా చేస్తాడా..? ఏమో జ‌న‌తా గ్యారేజ్ ఆడియ‌న్స్ కు బాగా క‌నెక్ట్ అయితే ఆ డ్రీమ్ నిజం కావోచ్చేమో !.

Click to Read….

జ‌న‌తా గ్యారేజ్ కు ప్ర‌చారం పెంచేశారు జ‌న‌తా గ్యారేజ్ కు ప్ర‌చారం పెంచేశారు

First Published:  30 Aug 2016 10:07 AM GMT
Next Story