Telugu Global
Cinema & Entertainment

సెప్టెంబర్ 4న మజ్ను ఆడియో రిలీజ్        

విరించి వర్మ దర్శకత్వంలో నాని చేస్తున్న కొత్త సినిమా మజ్ను. ఈ సినిమా ఆడియో రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. సెప్టెంబర్ 4న ఈ సినిమా పాటల్ని మార్కెట్లోకి తీసుకొస్తారు. అయితే అంతకంటే ముందే రెండు పాటల్ని విడుదలచేశారు. కళ్లుమూసి తెరిచేలోపే గుండెలోకి చేరావే అనే పాటను తొలిసారిగా ఎఫ్ఎంలో విడుదల చేశారు. ఓహో మేఘమాల అనే ఇంకో పాటను కూడా ఎఫ్ఎంలో విడుదల చేశారు. ఈ రెండు పాటలతో పాటు మిగతా పాటలన్నీ సెప్టెంబర్ 4న […]

సెప్టెంబర్ 4న మజ్ను ఆడియో రిలీజ్        
X
విరించి వర్మ దర్శకత్వంలో నాని చేస్తున్న కొత్త సినిమా మజ్ను. ఈ సినిమా ఆడియో రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. సెప్టెంబర్ 4న ఈ సినిమా పాటల్ని మార్కెట్లోకి తీసుకొస్తారు. అయితే అంతకంటే ముందే రెండు పాటల్ని విడుదలచేశారు. కళ్లుమూసి తెరిచేలోపే గుండెలోకి చేరావే అనే పాటను తొలిసారిగా ఎఫ్ఎంలో విడుదల చేశారు. ఓహో మేఘమాల అనే ఇంకో పాటను కూడా ఎఫ్ఎంలో విడుదల చేశారు. ఈ రెండు పాటలతో పాటు మిగతా పాటలన్నీ సెప్టెంబర్ 4న ఒకేసారి విడుదల చేయబోతున్నారు. లహరి మ్యూజిక్ సంస్థ ద్వారా ఈ పాటలు మార్కెట్లోకి రాబోతున్నాయి. సినిమాను కూడా సెప్టెంబర్ మూడు లేదా చివరి వారంలో విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మూవీలో నాని సరసన ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఉయ్యాల జంపాల తర్వాత విరించి వర్మ డైరక్ట్ చేస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. ఈ సినిమాతో తన వరుస విజయాల పరంపరను కొనసాగించాలని అనుకుంటున్నాడు హీరో నాని. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై నాని నమ్మకం మరింత పెరిగింది.
First Published:  30 Aug 2016 2:22 AM GMT
Next Story