Telugu Global
Cinema & Entertainment

విష్ణు  సరసన మరోసారి ఆపిల్ పిల్ల 

దేనికైనా రెడీ, పాండవులు పాండవులు తుమ్మెద వంటి హిట్ చిత్రాల్లో విష్ణు మంచు సరసన నటించిన బబ్లీ బ్యూటీ హన్సిక ముచ్చటగా మూడోసారి జత కట్టనుంది. ఈసారి వీళ్లిద్దరి కాంబినేషన్ లో లక్కున్నోడు టైటిల్ తో ఓ సినిమా రాబోతోంది. త్రిపుర, గీతాంజలి లాంటి హారర్ సినిమాల్ని తెరకెక్కించిన రాజ్ కిరణ్ ఈ కాంబినేషన్ కు దర్శకుడు. ఈమధ్య ఈడోరకం-ఆడోరకం సినిమాను నిర్మించిన ఎంవీవీ సత్యనారాయణ, మరోసారి విష్ణుతో కలిసి నిర్మిస్తున్న సినిమా ఇది. త్వరలోనే సినిమా […]

విష్ణు  సరసన మరోసారి ఆపిల్ పిల్ల 
X

దేనికైనా రెడీ, పాండవులు పాండవులు తుమ్మెద వంటి హిట్ చిత్రాల్లో విష్ణు మంచు సరసన నటించిన బబ్లీ బ్యూటీ హన్సిక ముచ్చటగా మూడోసారి జత కట్టనుంది. ఈసారి వీళ్లిద్దరి కాంబినేషన్ లో లక్కున్నోడు టైటిల్ తో ఓ సినిమా రాబోతోంది. త్రిపుర, గీతాంజలి లాంటి హారర్ సినిమాల్ని తెరకెక్కించిన రాజ్ కిరణ్ ఈ కాంబినేషన్ కు దర్శకుడు. ఈమధ్య ఈడోరకం-ఆడోరకం సినిమాను నిర్మించిన ఎంవీవీ సత్యనారాయణ, మరోసారి విష్ణుతో కలిసి నిర్మిస్తున్న సినిమా ఇది. త్వరలోనే సినిమా సెట్స్ పైకి రాబోతోంది. ప్రస్తుతం హన్సిక వరుస తమిళ సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం అక్కడ చేస్తున్న షెడ్యూల్ పూర్తయిన వెంటనే… విష్ణుతో సినిమా ప్రారంభం అవుతుంది. ఈ సినిమాకు ప్రవీణ్ లక్కరాజు సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. రాజ్ కిరణ్ నేతృత్వంలో ఈ సంగీత చర్చలు చురుగ్గా సాగుతున్నాయి. హన్సిక కాల్షీట్లు ఎడ్జెస్ట్ అయిన వెంటనే… పాటలతో షూటింగ్ మొదలుపెట్టాలని అనుకుంటున్నారు. దేనికైనా రెడీ సినిమా నుంచి హన్సికను గోల్డెన్ గాళ్ గా ఫీల్ అవుతున్నాడు విష్ణు.

First Published:  29 Aug 2016 2:21 AM GMT
Next Story