Telugu Global
Cinema & Entertainment

షాహిద్ కపూర్ తండ్రి అయ్యాడు...

షాహిద్ కపూర్ పెళ్లి చేసుకొని జస్ట్ ఏడాది దాటిందంతే. ఇంతలోనే ఈ హీరో తండ్రి అయ్యాడు. ఆయన భార్య మీరా రాజపుత్ ఓ పండంటి పాపకు జన్మనిచ్చింది. ముంబయిలోని హిందూజ హాస్పిటల్ లో మీరాకు పాప పుట్టినట్టు హాస్పిటల్ వర్గాలు ప్రకటించాయి. ప్రస్తుతం తనకు కూతురు పుట్టిందన్న సంతోషంలో ఉన్నాడు షాహిద్ కపూర్. వెంటనే తన పాప ఫొటోను సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లో షేర్ చేశాడు. ఇంత ఆనందాన్ని జీవితంలో ఎప్పుడూ పొందలేదంటున్నాడు. గతేడాది […]

షాహిద్ కపూర్ తండ్రి అయ్యాడు...
X

షాహిద్ కపూర్ పెళ్లి చేసుకొని జస్ట్ ఏడాది దాటిందంతే. ఇంతలోనే ఈ హీరో తండ్రి అయ్యాడు. ఆయన భార్య మీరా రాజపుత్ ఓ పండంటి పాపకు జన్మనిచ్చింది. ముంబయిలోని హిందూజ హాస్పిటల్ లో మీరాకు పాప పుట్టినట్టు హాస్పిటల్ వర్గాలు ప్రకటించాయి. ప్రస్తుతం తనకు కూతురు పుట్టిందన్న సంతోషంలో ఉన్నాడు షాహిద్ కపూర్. వెంటనే తన పాప ఫొటోను సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లో షేర్ చేశాడు. ఇంత ఆనందాన్ని జీవితంలో ఎప్పుడూ పొందలేదంటున్నాడు. గతేడాది జులైలో షాహిద్ కపూర్, మీరాను పెళ్లి చేసుకున్నాడు. ఢిల్లీకి చెందిన మీరాతో దాదాపు ఏడాదిన్నరగా ప్రేమాయణం సాగించిన తర్వాత షాహిద్ పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం తల్లి-బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. మరోవైపు తనకు పాప పుట్టిన సందర్భంగా… బాలీవుడ్ ప్రముఖులకు గ్రాండ్ పార్టీ ఏర్పాటుచేశాడు షాహిద్. ఈ ఆనందాన్ని మరింతగా సెలబ్రేట్ చేసుకునేందుకు.. తన కొత్త సినిమా షూటింగ్ ను కూడా కొన్నాళ్లు పోస్ట్ పోన్ చేశాడు.

First Published:  28 Aug 2016 1:18 AM GMT
Next Story