Telugu Global
Cinema & Entertainment

ఎన్టీఆర్ కొత్త సినిమా పేరు అదే...

ప్రస్తుతం జనతా గ్యారేజ్ పనుల్లో బిజీగా ఉన్నాడు తారక్. అయితే ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత చేయబోయే నెక్ట్స్ సినిమా ఏంటనేది ఇప్పటికే ప్రకటించాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కల్యాణ్ రామ్ నిర్మాతగా… రచయిత వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఎన్టీఆర్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమా కోసం ఇప్పటికే కథ, స్క్రీన్ ప్లే సిద్ధం చేసుకున్న వక్కంతం వంశీ.. తాజాగా టైటిల్ కూడా ఫిక్స్ చేశాడు. తాజా సమాచారం ప్రకారం… […]

ఎన్టీఆర్ కొత్త సినిమా పేరు అదే...
X

ప్రస్తుతం జనతా గ్యారేజ్ పనుల్లో బిజీగా ఉన్నాడు తారక్. అయితే ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత చేయబోయే నెక్ట్స్ సినిమా ఏంటనేది ఇప్పటికే ప్రకటించాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కల్యాణ్ రామ్ నిర్మాతగా… రచయిత వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఎన్టీఆర్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమా కోసం ఇప్పటికే కథ, స్క్రీన్ ప్లే సిద్ధం చేసుకున్న వక్కంతం వంశీ.. తాజాగా టైటిల్ కూడా ఫిక్స్ చేశాడు. తాజా సమాచారం ప్రకారం… ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమాకు ధడ్కన్ అనే టైటిల్ అనుకుంటున్నారట. దీనిపై ఎన్టీఆర్ ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని వెల్లడించలేదు. ఈ టైటిల్ కు అన్ని వర్గాలు, అన్ని ఏరియాస్ నుంచి రెస్పాన్స్ వస్తుందా అనేది చూడాలి. ఎందుకంటే.. ధడ్కన్ అనేది తెలంగాణలో పాపులర్ కావొచ్చు.. కానీ ఏపీలో, మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లోఈ పేరు పాపులర్ అవుతుందా అనేది పెద్ద ప్రశ్న. తన టైటిల్స్ విషయంలో ఎప్పుడూ అందరి ఆమోదం గురించి ఆలోచించే తారక్… ధడ్కన్ విషయంలో మాత్రం ఇంకా ఎలాంటి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. జనతా గ్యారేజ్ విడుదలైన వారం రోజులకు, కొత్త సినిమా టైటిల్ తో పాటు హీరోయిన్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

First Published:  28 Aug 2016 1:07 AM GMT
Next Story