Telugu Global
Cinema & Entertainment

మరో ఎఫ్ఎం ద్వారా రెండో పాట విడుదల

మజ్ను ఎఫ్ఎం రేడియోల చుట్టూ తిరుగుతున్నాడు. మినిమం గ్యాప్ లో పాటలు విడుదల చేస్తున్నాడు. హైదరాబాద్ రెడ్ ఎఫ్ఎం ద్వారా మజ్ను సినిమాలని ఓయ్ మేఘమాల అనే పాటను విడుదల చేశాడు హీరో నాని. ఇప్పటికే విడుదలైన పాటల్లో ఇది రెండోది. ఉయ్యాల జంపాల ఫేం విరించి వర్మ దర్శకత్వంలో నాని మజ్ను అనే సినిమా చేస్తున్న విషయం విషయం తెలిసిందే. ఆనంది ఆర్ట్స్ బ్యానర్ పై కిరణ్ నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి […]

మరో ఎఫ్ఎం ద్వారా రెండో పాట విడుదల
X

మజ్ను ఎఫ్ఎం రేడియోల చుట్టూ తిరుగుతున్నాడు. మినిమం గ్యాప్ లో పాటలు విడుదల చేస్తున్నాడు. హైదరాబాద్ రెడ్ ఎఫ్ఎం ద్వారా మజ్ను సినిమాలని ఓయ్ మేఘమాల అనే పాటను విడుదల చేశాడు హీరో నాని. ఇప్పటికే విడుదలైన పాటల్లో ఇది రెండోది.
ఉయ్యాల జంపాల ఫేం విరించి వర్మ దర్శకత్వంలో నాని మజ్ను అనే సినిమా చేస్తున్న విషయం విషయం తెలిసిందే. ఆనంది ఆర్ట్స్ బ్యానర్ పై కిరణ్ నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి సంబంధించి ‘కళ్ళు మూసి తెరిచే లోపే.. గుండెలోకే చేరావే..’ అంటూ సాగే మొదటి పాటను ఇటీవల రేడియో మిర్చి ద్వారా విడుదల చేశారు. కాగా, ‘ఓయ్‌.. మేఘమాల..’ అంటూ సాగే రెండో పాటను రెడ్‌ ఎఫ్‌.ఎం. ద్వారా రిలీజ్‌ చేశారు. ఈ చిత్రం ఆడియోను లహరి మ్యూజిక్‌ ద్వారా ఈ వారంలోనే రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సెప్టెంబర్‌లో చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేస్తున్నారు. ఈ చిత్రంలో సూపర్‌ సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ ఎస్‌.ఎస్‌.రాజమౌళి ఓ ప్రత్యేక పాత్రలో కనిపించడం విశేషంగా చెప్పుకోవచ్చు. నేచురల్‌ స్టార్‌ నాని, ఇమ్మానుయేల్‌, ప్రియాశ్రీ, వెన్నెల కిషోర్‌, సత్యకృష్ణ, పోసాని కృష్ణమురళి, సప్తగిరి, సత్య, శివన్నారాయణ, రాజ్‌ మాదిరాజ్‌, కేవశదీప్‌, అనుపమ, మనీషా తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీత దర్శకుడు గోపీసుందర్‌.

First Published:  28 Aug 2016 1:21 AM GMT
Next Story