Telugu Global
Cinema & Entertainment

విక్రమ్ కుమార్ పెళ్లికి అంతా సిద్ధం

మొన్నటికి మొన్న దర్శకుడు క్రిష్ పెళ్లిచేసుకున్నాడు. టాలీవుడ్ అంతా సందడి నెలకొంది. తారాగణమంతా కదలివచ్చింది. ఇప్పుడు మరో దర్శకుడు పెళ్లికి రెడీ అయిపోయాడు. దర్శకుడు విక్రమ్ కుమార్.. సెప్టెంబర్ 4న వివాహం చేసుకోబోతున్నాడు. కొన్నేళ్లుగా విక్రమ్ కుమార్-శ్రీనిధి ప్రేమించుకుంటున్నాడు. ఈమధ్యే పెద్దల అంగీకారంతో వీళ్లిద్దరి యంగేజ్ మెంట్ కూడా పూర్తయింది. తాజాగా డేట్ ఫిక్స్ అయింది. చెన్నైలోని ఓ ఫంక్షన్ హాల్ లో విక్రమ్ కుమార్ -శ్రీనిధి ఒకటి కాబోతున్నాడు. ఇప్పటికే టాలీవుడ్ కు చెందిన పలువురు […]

విక్రమ్ కుమార్ పెళ్లికి అంతా సిద్ధం
X

మొన్నటికి మొన్న దర్శకుడు క్రిష్ పెళ్లిచేసుకున్నాడు. టాలీవుడ్ అంతా సందడి నెలకొంది. తారాగణమంతా కదలివచ్చింది. ఇప్పుడు మరో దర్శకుడు పెళ్లికి రెడీ అయిపోయాడు. దర్శకుడు విక్రమ్ కుమార్.. సెప్టెంబర్ 4న వివాహం చేసుకోబోతున్నాడు. కొన్నేళ్లుగా విక్రమ్ కుమార్-శ్రీనిధి ప్రేమించుకుంటున్నాడు. ఈమధ్యే పెద్దల అంగీకారంతో వీళ్లిద్దరి యంగేజ్ మెంట్ కూడా పూర్తయింది. తాజాగా డేట్ ఫిక్స్ అయింది. చెన్నైలోని ఓ ఫంక్షన్ హాల్ లో విక్రమ్ కుమార్ -శ్రీనిధి ఒకటి కాబోతున్నాడు. ఇప్పటికే టాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు అందించాడు విక్రమ్. వీళ్లలో అక్కినేని ఫ్యామిలీ హీరోలతో పాటు.. నితిన్, అల్లు అర్జున్ లాంటి హీరోలున్నారు.

ఈ పెళ్లిని చాలా లో-ప్రొఫైల్ లో జరుపుకుంటున్నాడు విక్రమ్ కుమార్. పెద్దగా ఆర్భాటం చేయడం లేదు. ఎంగేజ్ మెంట్ ను కూడా కుటుంబ సభ్యుల మధ్య సీక్రెట్ గా కానిచ్చేశాడు. ఇప్పుడు పెళ్లి కూడా సింపుల్ గా చేసుకుందామని అనుకుంటున్నాడు. అయితే వీళ్ల పెళ్లికి ఎవరు వచ్చినా, రాకున్నా… సంగీత సంచలనం ఏఆర్ రెహ్మాన్ మాత్రం కచ్చితంగా వస్తాడు. ఎఁదుకంటే… పెళ్లికూతురు శ్రీనిధి, రెహ్మాన్ స్టుడియోలోనే సౌండ్ ఇంజినీర్ గా పనిచేస్తోంది. సూర్య నటించిన 24 అనే సినిమా టైమ్ లోనే విక్రమ్ కుమార్-శ్రీనిధికి పరిచయం ఏర్పడింది.

First Published:  28 Aug 2016 1:07 AM GMT
Next Story