Telugu Global
Cinema & Entertainment

రణబీర్ కపూర్ కు తండ్రిగా అమీర్ ఖాన్

ప్రయోగాలు చేయాలంటే ఎప్పుడూ ముందుంటాడు అమీర్ ఖాన్. అతడు చేసిన త్రీ ఇడియట్స్, లగాన్, పీకే చిత్రాలు అమీర్ స్టామినాను చెబుతాయి. తాజాగా దంగల్ అనే మరో ప్రయోగాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చే పనిలో బిజీగా ఉన్నాడు అమీర్. ఈ సినిమాలో రెజ్లర్ గా, మధ్య వయష్కుడిగా కనిపించబోతున్నాడు. ఇదిలా ఉండగా… త్వరలోనే రణబీర్ కు తండ్రిగా కూడా కనిపించేందుకు అమీర్ ఖాన్ అంగీకరించినట్టు తెలుస్తోంది. సంజయ్ దత్ జీవితం ఆధారంగా ఓ సినిమాను రూపొందించాలని రాజ్ […]

రణబీర్ కపూర్ కు తండ్రిగా అమీర్ ఖాన్
X

ప్రయోగాలు చేయాలంటే ఎప్పుడూ ముందుంటాడు అమీర్ ఖాన్. అతడు చేసిన త్రీ ఇడియట్స్, లగాన్, పీకే చిత్రాలు అమీర్ స్టామినాను చెబుతాయి. తాజాగా దంగల్ అనే మరో ప్రయోగాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చే పనిలో బిజీగా ఉన్నాడు అమీర్. ఈ సినిమాలో రెజ్లర్ గా, మధ్య వయష్కుడిగా కనిపించబోతున్నాడు. ఇదిలా ఉండగా… త్వరలోనే రణబీర్ కు తండ్రిగా కూడా కనిపించేందుకు అమీర్ ఖాన్ అంగీకరించినట్టు తెలుస్తోంది.

సంజయ్ దత్ జీవితం ఆధారంగా ఓ సినిమాను రూపొందించాలని రాజ్ కుమార్ హిరాణి భావిస్తున్నాడు. ఇందులో సంజయ్ దత్ పాత్రను రణబీర్ కపూర్ పోషించబోతున్నాడు. ఇక సంజయ్ దత్ తండ్రి సునీల్ దత్ పాత్రను అమీర్ ఖాన్ పోషించే అవకాశాలున్నాయి. తనకు పీకే, త్రీఇడియట్స్ లాంటి హిట్స్ ఇచ్చిన రాజకుమార్ హిరాణి అంటే అమీర్ కు ప్రత్యేకమైన అభిమానం. అందుకే హిరాణి అడిగిన వెంటనే అమీర్ ఒప్పుకున్నాడని తెలుస్తోంది.

సినిమాలో ఎక్కువగా అమీర్-రణబీర్ మధ్య సన్నివేశాలే వచ్చేలా స్క్రిప్ట్ వర్క్ తయారుచేశారట. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని అంశాలు వెలుగులోకి రాబోతున్నాయి. ప్రస్తుతం అమీర్, రణబీర్ కపూర్ చేస్తున్న సినిమాలు కంప్లీట్ అయిన వెంటనే.. .తాజా బయోపిక్ సెట్స్ పైకి వస్తుంది.

First Published:  25 Aug 2016 9:22 PM GMT
Next Story