Telugu Global
NEWS

నేరం చేయ‌కుండానే జైల్లో చిప్ప‌కూడు రుచి చూసే అవ‌కాశం...ఫీల్ ది జైల్!

జైల్లో ఖైదీలు ఎలా ఉంటారు…ఏం తింటారు…ఎలా నిద్ర పోతారు….ఇలాంటి సమాచార‌మంతా మ‌న‌కు తెలిసేది సినిమాల ద్వారానే. నిజంగా జైళ్ల‌ను చూసే అవ‌కాశం, అవ‌స‌రం ఉండ‌దు. కానీ అలాంటి జైలు జీవితం అనుభ‌వాన్ని రుచి చూడాల‌నుకునేవారికోసం మెద‌క్ జిల్లా సంగారెడ్డిలోని పాత జిల్లా జైలులో అవ‌కాశం క‌ల్పించారు. దీన్ని  మ్యూజియంగా మార్చి సంద‌ర్శ‌కుల‌కు చూసే అవ‌కాశం క‌ల్పిస్తున్న సంగ‌తి తెలిసిందే.  అయితే జైలు ఎలా ఉంటుందో చూసి బ‌య‌ట‌కు రావ‌డ‌మే కాకుండా ఒక‌రోజంతా ఖైదీలా లోప‌ల ఉండి… జైలు […]

నేరం చేయ‌కుండానే జైల్లో చిప్ప‌కూడు రుచి చూసే అవ‌కాశం...ఫీల్ ది జైల్!
X

జైల్లో ఖైదీలు ఎలా ఉంటారు…ఏం తింటారు…ఎలా నిద్ర పోతారు….ఇలాంటి సమాచార‌మంతా మ‌న‌కు తెలిసేది సినిమాల ద్వారానే. నిజంగా జైళ్ల‌ను చూసే అవ‌కాశం, అవ‌స‌రం ఉండ‌దు. కానీ అలాంటి జైలు జీవితం అనుభ‌వాన్ని రుచి చూడాల‌నుకునేవారికోసం మెద‌క్ జిల్లా సంగారెడ్డిలోని పాత జిల్లా జైలులో అవ‌కాశం క‌ల్పించారు. దీన్ని మ్యూజియంగా మార్చి సంద‌ర్శ‌కుల‌కు చూసే అవ‌కాశం క‌ల్పిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే జైలు ఎలా ఉంటుందో చూసి బ‌య‌ట‌కు రావ‌డ‌మే కాకుండా ఒక‌రోజంతా ఖైదీలా లోప‌ల ఉండి… జైలు జీవితం ఎలా ఉంటుందో రుచి చూసే అవ‌కాశం కూడా ఇక్క‌డ ఉంది.

museumజైలుకి వెళితే కానీ స్వేచ్ఛ విలువ అర్థం కాదు. అంటే ఒకేసారి ఖైదు జీవితం, స్వేచ్ఛ విలువ ఈ రెండు అనుభంలోకి వ‌స్తాయ‌న్న‌మాట‌. మ‌రి ఈ వింత అనుభ‌వాన్ని పొందాలంటే డ‌బ్బు చెల్లించాల్సి ఉంటుంది. 24 గంటలు ఖైదులో ఉండ‌టానికి 500 రూ.లు జైళ్ల శాఖ‌కు చెల్లించాలి. లాక‌ప్‌లో ఉండటం అంటే కాసేపు క‌ట‌క‌టాల వెనుక ఉండి వ‌చ్చేయ‌టం కాదు. ఖైదీలు వేసుకునే దుస్తుల‌ను కూడా ఇస్తారు. అన్నం తినే స్టీలు ప్లేటు, స్టీలు గ్లాసు, జ‌గ్గు, దుప్ప‌ట్లు, వాషింగ్ సోప్‌, టాయిలెట్ సోప్‌…లాంటి సామ‌గ్రిని సైతం ఇస్తారు. ఆహారం కూడా జైలు వ్య‌వ‌స్థ‌లోని ప‌ద్ధ‌తి ప్రకార‌మే ఉంటుంది. అద‌నంగా ఒక్క ఫ్యాను సౌక‌ర్యం మాత్రం ఉంటుంది.

ఉద‌యం ఆరు ఆరున్న‌ర మ‌ధ్య టీ, ఏడు ఏడున్న‌ర మ‌ధ్య టిఫిన్‌, ప‌దిన్న‌ర ప‌ద‌కొండు మ‌ధ్య భోజ‌నం, మ‌ళ్లీ ప‌న్నెండున్న‌రకు టీ, నాలుగున్న‌ర ఐదు మ‌ధ్య భోజ‌నం ఉంటాయి. టీని అక్క‌డే త‌యారుచేస్తారు. ఆహారం మాత్రం ఖండీలోని జిల్లా జైలు నుండి వ‌స్తుంది. టిఫిన్‌గా చ‌పాతి, చిత్రాన్నం, ఒక కూర ర‌సంతో ఒక‌రోజు, ప‌ప్పు, ర‌సంతో మ‌రో రోజు లంచ్ ఉంటుంది. డిన్న‌ర్‌లో క‌ర్రీ ర‌సంతో పాటు పెరుగు ఇస్తారు. ప్ర‌త్యేకంగా ప‌నివాళ్లు ఉండ‌రు…జైలు జీవితాన్ని ఫీల్ అవ‌డానికి వ‌చ్చిన‌వారే వారి గ‌దుల‌ను ఊడ్చుకోవాలి. ఖైదీలు చేసే పనులేమీ చెప్ప‌రు కానీ…ఇష్ట‌ముంటే మొక్క‌లు నాట‌వ‌చ్చు. జూన్ ఐదు నుండి పెద్ద‌వాళ్ల‌కు 10రూ.లు, పిల్ల‌ల‌కు 5రూ.లు ప్ర‌వేశ రుసుముతో జైలు మ్యూజియం న‌డుస్తుండ‌గా… ఖైదీ అనుభ‌వం పొందాల‌ని అనుకునేవారి నుండి ప్ర‌త్యేక రుసుము వ‌సూలు చేస్తున్నారు.

Click on Image to Read:

chandrababu naidu rains1

ambati comments

harsha kumar

pinnelli ramakrishna reddy

tdp cabinet

ambati

bhumana karunakar reddy

sabita indra reddy

First Published:  25 Aug 2016 12:11 AM GMT
Next Story