Telugu Global
Cinema & Entertainment

మాయచేస్తున్న ప్రేమమ్ సాంగ్

అందరిలాగే నాగచైతన్య కూడా వెబ్ నే నమ్ముకున్నాడు. తన సినిమా పాటల్ని ఒక్కొక్కటిగా ఆన్ లైన్ లో రిలీజ్ చేస్తున్నాడు. ఆ తర్వాత పూర్తిస్థాయి ఆడియోను మార్కెట్లోకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇందులో భాగంగా మొదటగా విడుదల చేసిన ఎవరే అనే పాట సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మరీ ముఖ్యంగా యూబ్యూట్ లో ఈ పాట ఓ సంచలనంగా మారింది. తాజాగా ఈ పాట యూట్యూబ్ లో మిలియన్ మార్క్ చేరుకుంది. ఆగస్ట్ 17న విడుదలైన […]

మాయచేస్తున్న ప్రేమమ్ సాంగ్
X

అందరిలాగే నాగచైతన్య కూడా వెబ్ నే నమ్ముకున్నాడు. తన సినిమా పాటల్ని ఒక్కొక్కటిగా ఆన్ లైన్ లో రిలీజ్ చేస్తున్నాడు. ఆ తర్వాత పూర్తిస్థాయి ఆడియోను మార్కెట్లోకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇందులో భాగంగా మొదటగా విడుదల చేసిన ఎవరే అనే పాట సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మరీ ముఖ్యంగా యూబ్యూట్ లో ఈ పాట ఓ సంచలనంగా మారింది. తాజాగా ఈ పాట యూట్యూబ్ లో మిలియన్ మార్క్ చేరుకుంది. ఆగస్ట్ 17న విడుదలైన ఈ పాటను ఇప్పటివరకు 10లక్షల మంది చూశారు. నాగచైతన్య కెరీర్ లోనే దీన్నొక రికార్డుగా చెప్పుకోవచ్చు.

ప్రేమమ్ సినిమాకు రాజేష్ మురుగేశన్, గోపీ సుందర్ సంగీతం అందించారు. తాజాగా రికార్డు సృష్టించిన ఈ పాటను విజయ్ యేసుదాసు ఆలపించాడు. ఇందులోని సాహిత్యాన్ని శ్రీమణి అందించాడు. కార్తికేయతో పరిచయమైన దర్శకుడు చందూ మొండేటి… తన రెండో ప్రయత్నంగా ప్రేమమ్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. షూటింగ్ ఇప్పటికే పూర్తిచేసుకున్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. నాగ చైతన్య సరసన శృతి హాసన్, అనుపమ పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్.. హీరోయిన్లు నటించిన ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ఓ స్పెషల్ రోల్ చేయడం విశేషం. సినిమాను వచ్చేనెలలో విడుదల చేస్తున్నారు.

Also Read

జనతా గ్యారేజ్ విడుదల తేదీ మళ్లీ మారింది… జనతా గ్యారేజ్ విడుదల తేదీ మళ్లీ మారింది…
మరోసారి హిట్ పై కన్నేసిన సూర్య మరోసారి హిట్ పై కన్నేసిన సూర్య
ర‌క్త చ‌రిత్ర 2 పార్ట్స్…  న‌యిమ్  చ‌రిత్ర 3 భాగాలు అంటున్న వ‌ర్మ‌ ర‌క్త చ‌రిత్ర 2 పార్ట్స్… న‌యిమ్ చ‌రిత్ర 3 భాగాలు అంటున్న వ‌ర్మ‌
First Published:  23 Aug 2016 9:43 PM GMT
Next Story