Telugu Global
Cinema & Entertainment

ఈ వారం  నిత్యామీన‌నే ఎట్రాక్ష‌న్..!

బాబు బంగారం చిత్రం త‌రువాత  అభిమానుల్ని ఇంప్రెస్ చేసే చిత్రం ప‌డ‌లేదు.  గ‌త వారం  వ‌చ్చిన రెండు చిత్రాలు బాక్సాపీస్ వ‌ద్ద  చ‌తిక‌ల బ‌డ‌టంతో  అంతా తుస్ మ‌న్న‌ది.  దీంతో ఈ వారం వ‌చ్చే చిత్రాల పై  ఆడియ‌న్స్   దృష్టి సారించారు.   ఈ శుక్ర‌వారం పేరుకు  4 చిత్రాలు వ‌ర‌కు రిలీజ్ అవుతున్నాయి. ధ‌నుష్  త‌మిళ్ లో చేసిన “నార‌దుడు” చిత్రం  ..అలాగే..  ధ‌న‌రాజ్ అత‌ని  జ‌బ‌ర్ధ‌స్త్ టీమ్ క‌ల‌సి “బంతిపూల జాన‌కి” పేరు తో ఒక […]

ఈ వారం  నిత్యామీన‌నే ఎట్రాక్ష‌న్..!
X

బాబు బంగారం చిత్రం త‌రువాత అభిమానుల్ని ఇంప్రెస్ చేసే చిత్రం ప‌డ‌లేదు. గ‌త వారం వ‌చ్చిన రెండు చిత్రాలు బాక్సాపీస్ వ‌ద్ద చ‌తిక‌ల బ‌డ‌టంతో అంతా తుస్ మ‌న్న‌ది. దీంతో ఈ వారం వ‌చ్చే చిత్రాల పై ఆడియ‌న్స్ దృష్టి సారించారు. ఈ శుక్ర‌వారం పేరుకు 4 చిత్రాలు వ‌ర‌కు రిలీజ్ అవుతున్నాయి. ధ‌నుష్ త‌మిళ్ లో చేసిన “నార‌దుడు” చిత్రం ..అలాగే.. ధ‌న‌రాజ్ అత‌ని జ‌బ‌ర్ధ‌స్త్ టీమ్ క‌ల‌సి “బంతిపూల జాన‌కి” పేరు తో ఒక చిత్రం చేశారు. ఇక త‌మిళ్ లో ద‌ర్శ‌కుడు ప్ర‌భుస‌ల్మాన్ డెబ్యూ గా చేసిన చిత్రం “తొలి ప్రేమలో” పేరు తో రిలీజ్ చేస్తున్నారు. అయితే వీటిన్నింటిలో నిత్యామీన‌న్.. దుల్క‌ర్ స‌ల్మాన్ లీడ్ రోల్స్ లో వ‌స్తున్న మ‌ల‌యాల చిత్రం “100 డేస్ ల‌వ్” సినిమా ఈ వారం ఆడియ‌న్స్ కాస్త అంచ‌నాలు పెట్టుకున్న చిత్ర‌మ‌ని చెప్పొచ్చు. ఈ సినిమా ఒరిజ‌న‌ల్ గా మ‌ల‌యాళంలో చేసిన విష‌యం తెలిసిందే. “100 డేస్ ల‌వ్” చిత్రం ట్రైల‌ర్స్.. ఇత‌ర చిత్రాలకంటే ఏదో కొత్త ద‌నం ఉండొచ్చు అనే ఫీలింగ్ ను ఆడియ‌న్స్ లో క‌లిగించాయి. మ‌రి సినిమా రిలీజ్ అయిన త‌రువాత ఏ మేర‌కు ఆడియ‌న్స్ ను అల‌రిస్తుందో లెట్స్ వెయిట్ అండ్ సీ.

First Published:  24 Aug 2016 12:13 PM GMT
Next Story