Telugu Global
Cinema & Entertainment

జనతా గ్యారేజ్ విడుదల తేదీ మళ్లీ మారింది...

అనుకున్నదే జరిగింది. కొన్ని రోజులుగా జనతా గ్యారేజ్ విడుదల తేదీపై వస్తున్న ఊహాగానాలే నిజమయ్యాయి. ఈ సినిమా రిలీజ్ డేట్ ను మరోసారి వాయిదావేశారు. గతంలో ప్రకటించినట్టు సెప్టెంబర్ 2న కాకుండా… ఒక రోజు ముందే అంటే సెప్టెంబర్ 1నే జనతా గ్యారేజ్ ను థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. సెప్టెంబర్ 2న దేశవ్యాప్తంగా బంద్ ఉంది. ఆ రోజున సినిమాను విడుదల చేస్తే ఆ ప్రభావం కచ్చితంగా కలెక్షన్లపై పడుతుంది. అందుకే జనతా గ్యారేజ్ సినిమాను సెప్టెంబర్ 2 నుంచి […]

జనతా గ్యారేజ్ విడుదల తేదీ మళ్లీ మారింది...
X

అనుకున్నదే జరిగింది. కొన్ని రోజులుగా జనతా గ్యారేజ్ విడుదల తేదీపై వస్తున్న ఊహాగానాలే నిజమయ్యాయి. ఈ సినిమా రిలీజ్ డేట్ ను మరోసారి వాయిదావేశారు. గతంలో ప్రకటించినట్టు సెప్టెంబర్ 2న కాకుండా… ఒక రోజు ముందే అంటే సెప్టెంబర్ 1నే జనతా గ్యారేజ్ ను థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. సెప్టెంబర్ 2న దేశవ్యాప్తంగా బంద్ ఉంది. ఆ రోజున సినిమాను విడుదల చేస్తే ఆ ప్రభావం కచ్చితంగా కలెక్షన్లపై పడుతుంది. అందుకే జనతా గ్యారేజ్ సినిమాను సెప్టెంబర్ 2 నుంచి సెప్టెంబర్ 1కు ప్రీ-పోన్ చేశారు.

నిజానికి ఈ సినిమా ఇప్పటికే థియేటర్లలోకి రావాల్సిందే. మొదట అనుకున్న ప్రకారం జనతా గ్యారేజ్ ను ఆగస్ట్ 12న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఆ టైమ్ కు షూటింగ్ పూర్తికాలేదు. ఇంకా కీలకమైన సన్నివేశాలు చాలానే మిగిలి ఉండిపోయాయి. అందుకే సెప్టెంబర్ 2కు విడుదల తేదీని మార్చారు. వినాయక చవితి కానుకగా సినిమాను దించుతున్నట్టు ప్రకటించారు. అయితే తాజా బంద్ సందర్భంగా ఒక రోజు ముందే జనతా గ్యారేజ్ సందడి చేయబోతోంది. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంత, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Also Read

మరోసారి హిట్ పై కన్నేసిన సూర్య మరోసారి హిట్ పై కన్నేసిన సూర్య
పుట్టినరోజు నాడు చిరంజీవి చేసిన పని ఇదే… పుట్టినరోజు నాడు చిరంజీవి చేసిన పని ఇదే…
ర‌క్త చ‌రిత్ర 2 పార్ట్స్…  న‌యిమ్  చ‌రిత్ర 3 భాగాలు అంటున్న వ‌ర్మ‌ ర‌క్త చ‌రిత్ర 2 పార్ట్స్… న‌యిమ్ చ‌రిత్ర 3 భాగాలు అంటున్న వ‌ర్మ‌
First Published:  23 Aug 2016 9:48 PM GMT
Next Story