Telugu Global
Cinema & Entertainment

మళ్లీ తెరపైకి వచ్చిన గాజువాక పిల్ల

గాజువాక పిల్ల… ఈ పాట వినిపించగానే మనసులో మెదిలే పేరు అనిత. నువ్వు-నేను సినిమాతో పాపులర్ అయిన ఈ భామ తెలుగు తెరకు దూరమై దాదాపు 4 ఏళ్లు కావొస్తోంది. ఈమధ్యే పెళ్లి కూడా చేసుకుంది. సో.. ఇప్పట్లో అనితను మళ్లీ తెరపై చూడలేమని అంతా అనుకున్నారు. కానీ పెళ్లి చేసుకున్న షార్ట్ టైంలోనే మళ్లీ తెరపైకి వచ్చేసింది అనిత. నాలుగేళ్ల గ్యాప్ కు బ్రేక్ వేసింది. ఆర్పీ పట్నాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మనలో ఒకడు సినిమాలో […]

మళ్లీ తెరపైకి వచ్చిన గాజువాక పిల్ల
X

గాజువాక పిల్ల… ఈ పాట వినిపించగానే మనసులో మెదిలే పేరు అనిత. నువ్వు-నేను సినిమాతో పాపులర్ అయిన ఈ భామ తెలుగు తెరకు దూరమై దాదాపు 4 ఏళ్లు కావొస్తోంది. ఈమధ్యే పెళ్లి కూడా చేసుకుంది. సో.. ఇప్పట్లో అనితను మళ్లీ తెరపై చూడలేమని అంతా అనుకున్నారు. కానీ పెళ్లి చేసుకున్న షార్ట్ టైంలోనే మళ్లీ తెరపైకి వచ్చేసింది అనిత. నాలుగేళ్ల గ్యాప్ కు బ్రేక్ వేసింది. ఆర్పీ పట్నాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మనలో ఒకడు సినిమాలో అనిత హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతో కచ్చితంగా మరోసారి తెలుగులో పాపులర్ అవుతానని అంటోంది.

ఈమధ్య కాలంలో మనలో ఒకడు సినిమా రెండు విషయాలతో పాపులర్ అయింది. అందులో ఒకటి అనిత రీఎంట్రీ అయితే… రెండోది ఏసుదాసు రీఎంట్రీ కూడా. అవును… చాన్నాళ్లుగా తెలుగుతెరకు దూరమైన ఏసుదాసు… లాంగ్ గ్యాప్ తర్వాత తెలుగులో పాట పాడారు. మనలో ఒకడు సినిమా కోసం ఏసుదాసు మరోసారి తన గాత్రాన్ని వినిపించారు. మోహన్ బాబు హవా నడిచిన రోజుల్లో ఏసుదాసు తరచుగా తెలుగులో పాటలు పాడేవారు. తర్వాత పూర్తిగా పాడడం తగ్గించేశారు. మళ్లీ ఇన్నాళ్లకు అర్పీ పట్నాయక్ చొరవతో ఏసుదాసు తన గానాన్ని వినిపించారు.

First Published:  22 Aug 2016 11:55 PM GMT
Next Story