Telugu Global
Cinema & Entertainment

జనతా గ్యారేజ్ సెన్సార్ కు సిద్ధం

జనతా గ్యారేజ్ సినిమా దాదాపు షూటింగ్ పూర్తిచేసుకుంది. కొంత ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ దాదాపు కంప్లీట్ అయిపోయింది. ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దీంతో పాటు సెన్సార్ కోసం డేట్ కూడా సిద్ధం చేశారు. మరో 3 రోజుల్లో ఫస్ట్ కాపీని సిద్ధం చేసి, ఈనెల 27న సినిమాను సెన్సార్ కు పంపించాలని నిర్ణయించారు. అయితే సెన్సార్ కంటే ముందే ప్రమోషన్ చేపట్టనున్నారు. టీవీల్లో యాడ్స్ ఇవ్వబోతున్నారు. ఈ సినిమాకు ప్రచారం […]

జనతా గ్యారేజ్ సెన్సార్ కు సిద్ధం
X

జనతా గ్యారేజ్ సినిమా దాదాపు షూటింగ్ పూర్తిచేసుకుంది. కొంత ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ దాదాపు కంప్లీట్ అయిపోయింది. ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దీంతో పాటు సెన్సార్ కోసం డేట్ కూడా సిద్ధం చేశారు. మరో 3 రోజుల్లో ఫస్ట్ కాపీని సిద్ధం చేసి, ఈనెల 27న సినిమాను సెన్సార్ కు పంపించాలని నిర్ణయించారు. అయితే సెన్సార్ కంటే ముందే ప్రమోషన్ చేపట్టనున్నారు. టీవీల్లో యాడ్స్ ఇవ్వబోతున్నారు. ఈ సినిమాకు ప్రచారం కల్పించేందుకు ఎన్టీఆర్ స్వయంగా కేరళ వెళ్లబోతున్నాడు. మోహన్ లాల్ తో కలిసి కేరళలోని పలు పట్టణాల్లో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటాడు. ఈ సినిమాతో 70కోట్ల రూపాయల మార్క్ ను అందుకోవాలని తారక్ భావిస్తున్నాడు. అందుకే సెప్టెంబర్ 2న జనతా గ్యారేజ్ సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల చేయాలని నిర్ణయించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే భారీ స్థాయిలో ప్రీ-రిలీజ్ బిజినెస్ పూర్తిచేసుకుంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జనతా గ్యారేజ్ లో సమంత, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

First Published:  22 Aug 2016 4:25 AM GMT
Next Story